Cyclone Sitrang: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి తప్పిన తుపాన్ ముప్పు..!

తుపాను ప్రభావంతో దక్షిణ అస్సాం, తూర్పు మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపురలతో సహా ఈశాన్య ప్రాంతాలు అక్టోబర్ 24, 25, 26 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Cyclone Sitrang: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి తప్పిన తుపాన్ ముప్పు..!

Cyclone Sitrang: ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడి అక్టోబర్ 25న పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ తీరాలను తాకుతుందని, దీనివల్ల గంటకు 110 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. ఐఎండీ సూచన ప్రకారం.. ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి అక్టోబరు 23న అల్పపీడనంగా, ఆపై బలమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది.

Pakistan Grey List: పాకిస్థాన్‌కు భారీ ఊరట.. గ్రే జాబితా నుండి పాక్‌ను తొలగించిన ఎఫ్‌ఏటీఎఫ్

అక్టోబరు 24నాటికి అల్పపీడనం ఉత్తరంవైపు తిరిగి పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంపై తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఇది ఉత్తర-ఈశాన్య దిశగా పయనించి అక్టోబర్ 25న ఒడిశా తీరాన్ని దాటి పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తన అంచనాలో పేర్కొంది.

తుపాను ప్రభావంతో దక్షిణ అస్సాం, తూర్పు మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపురలతో సహా ఈశాన్య ప్రాంతాలు అక్టోబర్ 24, 25, 26 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అక్టోబర్ 23 నుంచి తదుపరి సూచన వచ్చే వరకు మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని భారత వాతావరణ శాఖ తెలిపింది.