TTD Vaccine : వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులకు జీతాలు ఆపేసిన టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్ధానం తన ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది. టీటీడీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఇప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకోని 45 సంవత్సరాలు పైబడిన ఉద్యోగులకు జూన్ నెల జీతాలు నిలిపివేయాని టీటీడీ ఈఓ ఆదేశాలు జారీ చేశారు.

TTD Vaccine : వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులకు జీతాలు ఆపేసిన టీటీడీ

Ttd Vaccine

TTD Vaccine :  కరోనా కట్టడిలో భాగంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకోసం విస్తృత మైన ప్రచారం కల్పించి ఉచితంగా ప్రజలకు వ్యాక్సిన్ వేస్తున్నాయి. ఉచితంగా వద్దు అనుకున్న వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో రుసుము చెల్లించి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. కొన్ని ప్రైవేట్ సంస్ధలు కూడా తమ సంస్ధలో పనిచేసే ఉద్యోగులకు క్యాంపులు పెట్టి వ్యాక్సిన్ వేయిస్తున్నాయి. అలాంటి సంస్ధల్లో టీటీడీ కూడా ఉంది.

కాగా తిరుమల తిరుపతి దేవస్ధానం తన ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది. టీటీడీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఇప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకోని 45 సంవత్సరాలు పైబడిన ఉద్యోగులకు జూన్ నెల జీతాలు నిలిపివేయాని టీటీడీ ఈఓ ఆదేశాలు జారీ చేశారు.

టీటీడీలో అనేక మంది ఉద్యోగులు ఇంకా వ్యాక్సిన్ వేయించుకోలేదని గుర్తించిన టీటీడీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. జూలై 7 లోపు వ్యాక్సిన్ వేయించుకుని సంబంధిత సర్టిఫికెట్లను ఆయా డిపార్ట్‌మెంట్లలో అందజేయాలని ఈవో ఆదేశించారు. జులై 7 లోపు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకి జూలై 8 న జీతాలు వెంటనే చెల్లించాలని టీటీడీ ఈఓ  జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేసారు.