MP Nandigam Suresh : క్రాస్ ఓటింగ్ చేశారనే శ్రీదేవి సస్పెండ్.. ఆమెకు ప్రాణ హాని వైసీపీతో కాదు టీడీపీతోనే : ఎంపీ నందిగం సురేష్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేశారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు. క్రాస్ ఓటింగ్ కు ఎందుకు పాల్పడ్డారో స్వయంగా అమే నోటితోనే చెప్పారని తెలిపారు. సొంత పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారని ఆమెను ఇంతకాలం సీఎం జగన్ ఉపేక్షించారని వెల్లడించారు.

MP Nandigam Suresh : క్రాస్ ఓటింగ్ చేశారనే శ్రీదేవి సస్పెండ్.. ఆమెకు ప్రాణ హాని వైసీపీతో కాదు టీడీపీతోనే : ఎంపీ నందిగం సురేష్

Nandigam Suresh

MP Nandigam Suresh : ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేశారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు. క్రాస్ ఓటింగ్ కు ఎందుకు పాల్పడ్డారో స్వయంగా ఆమెనే చెప్పారని తెలిపారు. సొంత పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారని ఆమెను ఇంతకాలం సీఎం జగన్ ఉపేక్షించారని వెల్లడించారు. నువ్వు అమ్ముడు పోయి ఓటు వేశావని తాను ప్రమాణం చేస్తానని చెప్పారు. శ్రీదేవిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు. అమరావతి రైతుల గురించి ఆమె ఏమీ మాట్లాడారో గుర్తు తెచ్చుకోవాలన్నారు. పార్టీ లైన్ దాటారు కాబట్టే ఆమెను సస్పెండ్ చేశారని స్పష్టం చేశారు.

చంద్రబాబును పొగిడే ముందు దళితులకు ఆయన ఏమి చేశాడో తెలుసానని ప్రశ్నించారు. ఆమెను మ్యాకప్ ప్యాకప్ అని అమరావతీ రైతులు అన్నప్పుడు ఇవి గుర్తు లేదా? అని ప్రశ్నించారు. జగన్ మంచోడని చెప్పిన నీవు క్రాస్ ఓటింగ్ ఎందుకు వేశారని నిలదీశారు. 23మంది ఎమ్మేల్యేలు ఎక్కడికి వెళ్ళారో నీవు కూడా అక్కడికి వెళ్లావని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డిని మోసం చేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీ నలుగురు అక్కడే ఉన్నారని పేర్కొన్నారు. ఇల్లు పెద్ద స్కాం అన్న నీవు ఏమి చేశావో చూపిస్తామని సవాల్ చేశారు. మీరు చేసిన పాపం తట్టుకోలేక మీ ఆఫీసుపై దాడి చేశారని తెలిపారు.

Vundavalli Sridevi: అక్రమ మైనింగ్‌కు అడ్డుగా ఉన్నందుకే నాపై కుట్ర.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: ఉండవల్లి శ్రీదేవి

రిటర్న్ గిఫ్ట్ ఇచ్చె దమ్ము ఎవ్వరికీ లేదు.. ఇస్తే జగన్ అందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు అని అన్నారు. మీరు చేసిన అన్ని తప్పులు తెలిసినా ఎందుకు మౌనంగా ఉన్నామనేది తమకు తెలుసన్నారు. ఎవరి దగ్గర నుంచి మీకు ఏమి వచ్చాయో కూడా తమకు తెలుసని చెప్పారు. వైసీపీ ఎంపీగా తాను, తమ కార్యకర్తలు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇసుక మాఫియాపై తాను నార్కో టెస్ట్ కు సిద్ధమని చెప్పారు. వైసీపీ గురించి మాట్లాడే అర్హత శ్రీదేవికి లేదన్నారు.

మీరు మహిళా కాబట్టే ఉరుకుంటున్నామని, ఇలాగే వ్యవహరిస్తే రియాక్షన్ కచ్చితంగా ఉంటుందని శ్రీదేవిని హెచ్చరించారు. శ్రీదేవికి ప్రాణ హాని ఉంటే టీడీపీతో ఉంటుందని.. వైసీపీతో కాదని స్పష్టం చేశారు. శ్రీదేవి వెనుకా ముందు చూసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. దొంగతనంగా డబ్బులు తీసుకున్నది ఎవ్వరో తమకు తెలుసన్నారు. నాలుగు గోడల మధ్య నువ్వు తీసుకున్నవి ఎంటో నీకు తెలుసు అని అన్నారు. మందడం, హైదరాబాద్, బెంగుళూరు నుంచి ఏమి వచ్చాయో నీకు తెలియదా అని శ్రీదేవిని ఉద్దేశించి నందిగం సురేష్ వ్యాఖ్యానించారు.