Sajjala : చంద్రబాబు వల్లే రాష్ట్ర ప్రజలకు ఈ దుస్థితి.. తెలంగాణ ప్రభుత్వం ఆంబులెన్స్‌లను ఆపడం దురదృష్టకరం

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ ల నిలిపివేత వివాదంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏపీ నుంచి వచ్చే కరోనా పేషెంట్లను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. హైకోర్టు చెప్పినా తెలంగాణ ప్రభుత్వం అంబులెన్సులను అడ్డుకుంటోందని వాపోయారు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులు నిలిపివేయకుండా రోగులకు వైద్యం అందించే విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

Sajjala : చంద్రబాబు వల్లే రాష్ట్ర ప్రజలకు ఈ దుస్థితి.. తెలంగాణ ప్రభుత్వం ఆంబులెన్స్‌లను ఆపడం దురదృష్టకరం

Sajjala Rama Krishna Reddy

Sajjala Rama Krishna Reddy : ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ ల నిలిపివేత వివాదంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏపీ నుంచి వచ్చే కరోనా పేషెంట్లను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. హైకోర్టు చెప్పినా తెలంగాణ ప్రభుత్వం అంబులెన్సులను అడ్డుకుంటోందని వాపోయారు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులు నిలిపివేయకుండా రోగులకు వైద్యం అందించే విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. శుక్రవారం(మే 14,2021) ఆయన మీడియాతో మాట్లాడారు. బెంగుళూరు, చెన్నై హైదరాబాద్ లాంటి నగరాలతో పోలిస్తే ఏపీలో వైద్య సౌకర్యాలు తక్కువగా ఉన్నాయన్నారు. సరిహద్దుల్లో అంబులెన్స్ లు నిలిపివేయడంపై తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ సమస్యపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

హైకోర్టు చెప్పినా తెలంగాణ ప్రభుత్వం సాంకేతికంగా గైడ్‌లైన్స్ పెట్టిందన్నారు. తెలంగాణ పెట్టిన గైడ్‌లైన్స్ పాటించడం కష్టంగా ఉందని చెప్పారు. సరిహద్దుల్లో అంబులెన్స్ లను అడ్డుకోవడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక వసతులను అభివృద్ది చేయలేదన్నారు.

తమ రాష్ట్రంలోని ప్రజల గురించి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించడం సహజమేనని ఆయన చెప్పారు. అయినా మానవత్వంతో దీన్ని చూడాల్సిన అవసరం ఉందని ఆయన తెలంగాణ సర్కార్ ను కోరారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు తమకు ఇబ్బంది కల్గించడం లేదని సజ్జల గుర్తు చేశారు. సరిహద్దుల్లో అంబులెన్స్ లు నిలిపివేసే సమస్యను ఆవేశంతో కాకుండా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

వైద్యం కోసం ఏపీ నుంచి చెన్నై, బెంగళూరుకు వెళ్తున్నారని… ఎక్కడా రాని సమస్య తెలంగాణ సరిహద్దులోనే వస్తోందన్నారు. మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న రాష్ట్రాలకు వెళ్లడం సాధారణమన్నారు. గత ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టలేదని ఆయన విమర్శించారు. 2024 వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిందని, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేయడంతో తాము ఈ అవకాశాన్ని కోల్పోయామన్నారు. అడ్డగోలు విభజన చేసి వసతులు లేని ప్రాంతాలను ఏపీకి ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.

తమ వాళ్లను తాము చూసుకోవాలనే పట్టుదలలు పెరుగుతున్నాయని, దీనిపై సంయమనంతో వ్యవహరిస్తున్నామని.. న్యాయస్థానాలను ఆశ్రయించి సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సజ్జల వివరించారు. తెలంగాణ సరిహద్దులో అంబులెన్స్‌లను అడ్డుకుంటున్న వ్యవహారంపై ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌తో ఏపీ జగన్‌ మాట్లాడుతున్నారని సజ్జల అన్నారు. అధికారికంగా కాకపోయినా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌తో జగన్‌ మాట్లాడలేదని ఎందుకు అనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఏపీలో సదుపాయాలు లేవనే రోగులు హైదరాబాద్‌ వెళ్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారని.. వారి ప్రభుత్వం ఉన్న ఐదేళ్లలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని సజ్జల అన్నారు. చంద్రబాబు వల్లే ప్రజలు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని హక్కును ప్రజలు కోల్పోయారని ఆరోపించారు.

కాగా, తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌లు అడ్డుకోవడంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ అధికారులతో ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ మాట్లాడారు. అనంతరం ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.