Home » Author »naveen
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చందౌలి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆక్సిజన్ సిలిండర్ బాంబులా పేలింది. ఈ పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందారు. చందౌలి జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి బయట ఈ ప్రమాదం జరిగింది.
ముంబై చాకలా మెట్రో స్టేషన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని మెట్రో రైలు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఆమె గాయపడింది. లోకో పైలట్ నిర్లక్ష్యంతో గౌరీ కుమార్ సాహు అనే యువతి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది.
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం జి. మేడిపాడులో ఓ టీచర్.. విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థులపై రమణ అనే సోషల్ టీచర్ కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.
వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలు వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేశ్, నిర్వాహకుడు హనుమంతును జైలుకి తరలించే సమయంలో అయ్యప్ప స్వామి భక్తులు అడ్డుకున్నారు.
మత విద్వేశాలను రెచ్చగొడితే ఉపేక్షించేది లేదన్న ఎస్పీ.. భైరి నరేశ్ గతంలో కూడా చట్ట వ్యతిరేక పనులు చేశాడని చెప్పారు. నరేశ్ కు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.
తిరుపతి ఆర్టీసీ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశికి 10 రోజుల పాటు దర్శన టికెట్లు ఉన్న ప్రయాణికులను మాత్రమే కొండపైకి అనుమతించాలని నిర్ణయించింది.
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రేంజర్లలో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అయ్యప్ప స్వామి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు భైరి నరేశ్ తో కలిసి సభలో పాల్గొన్న అంబేద్కర్ సంఘం నేత రాజేశ్ ఇంటిని అయ్యప్ప భక్తు
Bairi Naresh On Ayyappa : అయ్యప్ప స్వామి గురించి ఓయూ స్టూడెంట్ బైరి నరేశ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా అగ్గి రాజేశాయి. నరేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అయ్యప్ప స్వాములు తీవ్రంగా మండిపడుతున్నారు. నరేశ్ ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. మ
అమరావతిని రాజధానిగా చేస్తే విశాఖను చిన్న రాష్ట్రంగా మార్చాలని డిమాండ్ చేశారు. తమకు విశాఖను ఇచ్చేయాలన్న ధర్మాన.. విశాఖను చిన్న రాష్ట్రంగా ఏర్పాటు చేసుకుంటామన్నారు.
హైదరాబాద్ జామై ఉస్మానియాలోని ప్రభుత్వ పాఠశాలలో అమానుష ఘటన చోటు చేసుకుంది. స్కూల్ కి ఆలస్యంగా వచ్చారనే కారణంతో స్కూల్ హెడ్ మాస్టర్ చిరంజీవి పదో తరగతి విద్యార్థులను చితకబాదాడు. గొడ్డును బాదినట్లు వారి బాదాడు.
న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు పోలీసులు. ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
హైదరాబాద్ పబ్ నిర్వాహకులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాత్రి 10 దాటిన తర్వాత సౌండ్ పెట్టొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ లోని పది పబ్బులు రాత్రి 10 గంటలు దాటిన తర్వాత మ్యూజిక్ పెట్టొద్దని ఆదేశించింది.
హైదరాబాద్ లో సివిల్స్ విద్యార్థిని పూజిత ఆత్మహత్య కలకలం రేపింది. పూజితను నిమ్స్ డాక్టర్ మహమ్మద్ అలీ ప్రేమ పేరుతో మోసం చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి ఓ దాత భారీ విరాళం అందించాడు. ఈ ఆభరణాల బరువు ఒక కేజీ 756 గ్రాములు. వీటి విలువ కోటి రూపాయల 30 లక్షలు.
ప్రేమిస్తున్నాను అంటూ విశాఖలో ఓ బాలికను వేధింపులకు గురి చేసిన రాఘవరావుతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని జనసేన స్పష్టం చేసింది. రాఘవరావుకి జనసేన పార్టీలో ఎలాంటి బాధ్యతలు లేవంది. అసలు క్రియాశీలక సభ్యత్వమే లేదని తేల్చి చెప్పింది.
మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తాను ఎమ్మెల్యేనా? కాదా? క్లారిటీ ఇవ్వాలని నియోజకవర్గ పరిశీలకుడు సత్యనారాయణ రెడ్డి ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫేస్ బుక్ లో ఫ్రెండ్ అయ్యాడు. వాట్సాప్ లో చాట్ చేశాడు. విలువైన బహుమతులను పంపిస్తున్నట్లు బిస్కట్ వేశాడు. అక్షరాల కోటి 20 లక్షలకు ముంచేశాడు. ఇది హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ వేదన. ఫేస్ బుక్ లో ఫ్రెండ్ షిప్ చేసిన ఆమె.. కోటి 20లక్షలు పోగొట్టుకుంది.
సూళ్లూరుపేటలో భారీ మోసం వెలుగుచూసింది. చిట్టీల పేరుతో ఓ మహిళ నిలువునా ముంచేసింది. సుమారు 12 కోట్లకు టోకరా వేసిన మహిళ.. కనిపించకుండా పోయిందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
కొత్త ఏడాదిలో వారాహి వాహనానికి పూజా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతోంది జనసేన పార్టీ. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో వచ్చే నెల 2న ఏకాదశి రోజున వాహన పూజ చేయనున్నారు.
Whatsapp To Stop Working : వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్. డిసెంబర్ 31 తర్వాత పలు స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు. దీనికి సంబంధించి వాట్సాప్ నుంచి ప్రకటన వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రతి సంవత్సరం పలు మొబైల్ ఫోన్లకు సపోర్ట్‌ను తొలగిస్తూ వస్తోంది వా�