Visakhapatnam State : రాజధానిగా అమరావతి, రాష్ట్రంగా విశాఖ? మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు
అమరావతిని రాజధానిగా చేస్తే విశాఖను చిన్న రాష్ట్రంగా మార్చాలని డిమాండ్ చేశారు. తమకు విశాఖను ఇచ్చేయాలన్న ధర్మాన.. విశాఖను చిన్న రాష్ట్రంగా ఏర్పాటు చేసుకుంటామన్నారు.

Visakhapatnam State : ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా చేస్తే విశాఖను చిన్న రాష్ట్రంగా మార్చాలని డిమాండ్ చేశారు. తమకు విశాఖను ఇచ్చేయాలన్న ధర్మాన.. విశాఖను చిన్న రాష్ట్రంగా ఏర్పాటు చేసుకుంటామన్నారు. చంద్రబాబు.. అమరావతిని వ్యాపార కేంద్రంగా మాత్రమే చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇల్లు, కార్పొరేట్ ఆఫీసులన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయన్నారు. వ్యాపారాలే ముఖ్యం అంటే మేము చూస్తూ ఊరుకోమన్నారు మంత్రి ధర్మాన.
Also Read..Kodali Nani : తమ ఆస్తులు మాత్రమే పెరగాలన్నది అమరావతి రైతుల ఆరాటం-కొడాలి నాని
”అమరావతిని రాజధానిగా చేస్తామని చంద్రబాబు ఎందుకు అంటున్నారు? ఏపీలో చంద్రబాబుకి ఇల్లు లేదు పొల్లు లేదు. చంద్రబాబు ఇల్లు హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉంది. చంద్రబాబు వ్యాపారం, కార్పొరేట్ ఆఫీసు అన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఇక్కడికేమీ రాడు. ఆంధ్రప్రదేశ్ ను ఒక వ్యాపార కేంద్రంగా చూస్తున్నాడు తప్ప మరొకటి లేదు.
Also Read..AP Capital: ఏపీ రాజధాని అమరావతే
హైదరాబాద్ లో మనకు జరిగిన ఎక్స్ పీరియన్స్ ఉండగా మళ్లీ ఆ తప్పు ఎవరైనా చేస్తారా? మీరు అమరావతిని కనుక రాజధాని చేస్తే మా రాష్ట్రం మాకు ఇచ్చేయండి. మా విశాఖ మాకు ఇచ్చేయండి. చిన్న రాష్ట్రం పెట్టుకుంటాం. వ్యాపారం చేసుకుంటాను, లే ఔట్లు వేసుకుంటాను చుట్టూ అంటే కుదరదు. భూమంతా కొనేందుకు మేము రెడీగా ఉన్నాం. మా వ్యాపారమే మాకు ముఖ్యం అంటే మేము ఊరుకునే పరిస్థితి ఇప్పుడు లేదు” అని మంత్రి ధర్మాన తేల్చి చెప్పారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.