Home » Author »tony bekkal
బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం కులగణనకు చేపట్టింది. అయితే దీనికి బీజేపీ మొకాలడ్డింది. కుల గణన చేయరాదని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్లో పేర్కొంది
లూనా 25.. ఆగస్టు 21 లేదా 22న చంద్రుడి ఉపరితలంపైకి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే చంద్రయాన్-3ని భారతదేశం జూలై 14న ప్రయోగించింది. ఇది ఆగస్టు 23న చంద్రునిపైకి రానుంది.
సరకు రవాణాలో 45% మార్కెట్ వాటాను సాధించే లక్ష్యంతో 2027 నాటికి 3,000 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యాన్ని చేరుకోవటం ద్వారా తమ ప్రస్తుత సామర్ధ్యం రెట్టింపు చేసే లక్ష్యంతో భారతీయ రైల్వే "మిషన్ 3000 MT" ప్రారంభించింది
రాష్ట్ర అసెంబ్లీలో ఎస్పీ మిత్రపక్షమైన ఆర్ఎల్డీకి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనికి ముందు కూడా బీజేపీతో ఆర్ఎల్డీ చేతులు కలపడంపై ఊహాగానాలు వచ్చాయి
గురువారం లోక్‌సభలో మోదీ ప్రసంగిస్తుండగా.. మణిపూర్ అంశంపై మోదీ నోరు విప్పాలంటూ విపక్ష నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే మోదీ అవేవీ పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వెళ్లారు
ఒకవైపు విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తుండగా, మరొకవైపు ప్రధాని ప్రసంగానికి కొనసాగింపుగా అధికార పక్షంలోని నేతలు కూడా అనుకూల నినాదాలు చేశారు. అయితే స్పీకర్ మాటలను విపక్షాలు లెక్కచేయలేదు
దీనికి ముందు లోక్‌సభలో మోదీ మాట్లాడుతూ.. విపక్షాలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతోందని అన్నారు. విపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని తమ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశ పెట్టారంటూ ఎద్దేవా చేశారు
2019 ఎన్నికలకు ముందు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో తమపై అవిశ్వాసం పెట్టారని, అయితే అది ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీని ఇచ్చిందని మోదీ అన్నారు.
వరద హెచ్చరికల అనంతరం వందలాది మందిని మంగళవారమే అత్యవసవర సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నోర్దిక్ ప్రాంతంలో పరిస్థితి విషమంగా ఉంది. విద్యుత్ వ్యవస్థ ధ్వంసం కావడంతో అనేక ప్రాంతాల్లో అంధకారం వ్యాపించింది.
తాజా అవిశ్వాస తీర్మానం కూడా వీగిపోయేట్టుగానే కనిపిస్తోంది. కారణం.. ఎన్డీయేకు మెజారిటీకి మించి ఎంపీలు ఉన్నారు. వాస్తవానికి తాము ఓడిపోతామని తెలిసి కూడా విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి.
మణిపూర్, ఢిల్లీ, రాజస్థాన్ ఇలా ఎక్కడైనా స్త్రీల బాధలను సీరియస్‌గా తీసుకోవాలనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను. అలాంటి వాటిలో రాజకీయాలు ఉండకూడదు. కానీ ఈ సభలో ద్రౌపది గురించి చర్చ జరిగింది. ఈ సభలో 25 సంవత్సరాలుగా ఉన్నాను.
చంద్రయాన్-3 ఏ సందర్భంలోనైనా చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవ్వొచ్చని అంటున్నారు. ల్యాండర్ "డీబూస్ట్" అయిన తర్వాత ల్యాండర్ ప్రొపల్షన్ మాడ్యూల్‌ను వేరు చేసే కసరత్తును త్వరలో ప్రారంభిస్తామని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చెప్పారు.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద వాంగ్మూలం ఇచ్చేందుకు జార్ఖాండ్ రాజధాని రాంచీలో వచ్చే వారం అందుబాటులో ఉండాలని హేమంత్ సోరెన్‌కు పంపిన తాజా సమన్లలో ఈడీ కోరింది
ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మార్కెట్ల ఈ కంపెనీ పని చేస్తోంది. ఇక తెలంగాణలోనూ తన లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ రుణాలను అందించడానికి EFL ఎదురుచూస్తోంది
భారత్ జోడో యాత్ర గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేసి 130 రోజుల పాటు కొనసాగిన యాత్ర జనవరి 30న శ్రీనగర్‌లో ముగిసింది
బాలాసాహెబ్ ఆలోచనను ముందుకు తీసుకెళ్లే పని మేము చేసాము. అంతే కాదు కరసేవకులపై కాల్పులు జరిపిన సమాజ్ వాదీ పార్టీతో పొత్తు కూడా పెట్టుకున్నారు. ఈరోజు మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా చదవడం కూడా నిషేధించబడింది
బాలికలు, మహిళలపై వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే నిందితులు, దుర్మార్గులను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం హిస్టరీ-షీటర్ల వంటి పోలీస్ స్టేషన్లలో వేధింపులకు పాల్పడిన వారి రికార్డు నమోదు చేయబడ
ఛింద్వారాలో బాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారి ధీరేంద్ర శాస్త్రిని స్వాగతించారు కమలనాథ్. అయితే దీనిపై సొంత కూటమి నుంచే విమర్శలు వచ్చాయి. రాష్ట్రీయ జనతా దళ్ నేత శివానంద్ తివారీ దీనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు
నిజానికి 2019లో సార్వత్రిక ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ 'దొంగలందరి ఇంటిపేరు మోదీ అని ఎలా వస్తుంది?' అని ప్రధాని నరేంద్ర మోదీని ఎగతాళి చేశారు
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు 26 విపక్షాలు కలిసి ఇండియా అనే పేరుతో మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో ఆప్ కూడా ఉంది. వాస్తవానికి ఇండియా కూటమి వద్ద ఒక ప్రతిపాదన ఉంది.