13ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేసిన ఫేస్‌బుక్ ఫ్రెండ్

  • Edited By: naveen , July 8, 2020 / 02:29 PM IST
13ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేసిన ఫేస్‌బుక్ ఫ్రెండ్

ముంబైలో దారుణం జరిగింది. ఫేస్ బుక్ లో పరిచయమైన ఫ్రెండ్ ఘాతుకానికి ఒడిగట్టాడు. 13ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. మంగళవారం(జూలై 7,2020) ఈ ఘటన జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాని నిందితుడిని, అతడికి సహకరించిన నలుగురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు వయసు 22 ఏళ్లు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో రెయిడ్స్ చేసి నిందితులను పట్టుకున్నారు. బాలికను వారి చెర నుంచి కాపాడారు.

minor girl rape at hyderabad

ముంబై టు రాజస్తాన్:
జూలై 1వ తేదీ నుంచి బాలిక కనిపించడం లేదు. కంగారుపడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఫేస్ బుక్ ఫ్రెండ్ తో బాలిక టచ్ లో ఉన్నట్టు పోలీసులు విచారణలో కనుగొన్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడి ఆచూకీ కనిపెట్టారు. వెంటనే ఓ పోలీసు బృందం రాజస్తాన్ లోని జల్వాడ్ కు మరో టీమ్ మధ్యప్రదేశ్ లోని రాజ్ గర్ కు వెళ్లింది. ఏకకాలంలో రెండు చోట్ల దాడులు చేసిన పోలీసులు కిడ్నాపర్ ను పట్టుకున్నారు. బాలికను వారి చెర నుంచి విడిపించారు.

బాలికను కిడ్నాప్ చేసి రేప్:
తన నలుగురు స్నేహితుల సాయంతో బాలికను కిడ్నాప్ చేసి రాజస్తాన్ తీసుకెళ్లి రేప్ చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఉన్నాయి. అయినా నిందితుడు ధైర్యంగా బాలికను కిడ్నాప్ చేసి ఓ వాహనంలో మరో రాష్ట్రానికి తీసుకెళ్లాడు. కాగా, దారిలో ఎక్కడా కూడా వాహనాన్ని ఆపి తనిఖీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఒక రాష్ట్రం నుంచి నుంచి మరో రాష్ట్రం వెళ్లాలంటే పర్మిషన్ ఉండాలి. పాస్ తీసుకోవాలి. కానీ అవేమీ లేకుండా నిందితుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ప్రధాని నిందితుడు, అతడికి సహకరించిన వారిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

rape attempt

సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు ప్రమాదకరం:
కాగా, ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన వాడు ఇంతటి దురాఘతానికి పాల్పడటం అందరిని షాక్ కి గురి చేసింది. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు మంచివి కాదని పోలీసులు పదే పదే చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కంత్రీగాళ్లు అమ్మాయిలకు ఎరవేస్తున్నారు. స్నేహం పేరుతో పరిచయం చేసుకుని దురాఘతాలకు ఒడిగడుతున్నారు. బ్లాక్ మెయిల్, కిడ్నాప్, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పిల్లలు ఏం చూస్తున్నారు? ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అనే విషయాలపై నిత్యం కన్నేసి ఉంచాలంటున్నారు. తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అంటున్నారు.

Read Here>>పోలీసుల రివెంజ్, గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే రైట్ హ్యాండ్ హతం