Lucknow hotel fire: లక్నోలోని హోటల్‌లో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు

యూపీలోని లక్నోలో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం స్థానిక హోటల్‌లో అగ్నిప్రమాదం కారంణంగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్ గదుల్లో ఉన్న వారిలో ఇద్దరు మరణించారు. మరో పది మంది గాయపడ్డారు.

Lucknow hotel fire: లక్నోలోని హోటల్‌లో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు

Lucknow hotel fire: ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరికొందరు మంటల్లో చిక్కుకున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం ఏడు గంటలకు లక్నోలోని లెనావా అనే హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది.

Viral video: జిమ్‌లో వర్కవుట్ చేస్తూ తలకిందులైన మహిళ.. స్మార్ట్‌వాచ్‌తో ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్.. వీడియో వైరల్

వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, పోలీసులు హోటల్ వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు మరణించారు. మరో పది మంది వరకు గాయాలపాలైనట్లు సమాచారం. దాదాపు 15 మందిని అధికారులు రక్షించారు. వీరిలో ఇద్దరు స్పృహ కోల్పోయారు. వీరిని, గాయపడ్డవారిని అధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. హోటల్ వెనుకవైపు నిచ్చెనలు ఏర్పాటు చేసి లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tamil Nadu: పొదల్లో శిశువు మృతదేహం.. స్కూల్లోనే ప్రసవించి, వదిలేసిన బాలిక

ఘటనా స్థలం వద్ద మూడు అంబులెన్స్‌లను అధికారులు సిద్ధంగా ఉంచారు. కాగా, ఈ హోటల్‌కు అధికారులు గతంలోనే నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.