Cocaine Seize : ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా కొకైన్ పట్టివేత.. కడుపులో దాచుకుని మహిళ అక్రమంగా తరలింపు

ఉంగాండా నుంచి వచ్చిన ఒక మహిళ కదిలికలను గుర్తించిన అధికారులు అమెను అరెస్టు చేశారు. ఆమెను ఢిల్లీ ఆర్ఎల్ ఎమ్ ఆస్పత్రికి తీసుకెళ్లి, టెస్టులు చేయగా కడుపులో 91 పిల్స్ ను గుర్తించారు.

Cocaine Seize : ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా కొకైన్ పట్టివేత.. కడుపులో దాచుకుని మహిళ అక్రమంగా తరలింపు

Cocine (1)

cocaine seized at Delhi airport : ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా కొకైన్ పట్టుబడింది. ఉగాండా నుంచి వచ్చిన మహిళ నుంచి కొకైన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 992 గ్రాముల కొకైన్ ను సీజ్ చేశారు. ఈ ఏడాదిలో 24 సార్లు కొకైన్ సీజ్ చేశారు. వీటి మొత్తం విలువ రూ. 845 కోట్లు ఉంటుంది.

మూడు రోజుల క్రితమే ఉంగాండా నుంచి వచ్చిన ఒక మహిళ కదిలికలను గుర్తించిన కస్టమ్స్ అధికారులు అమెను అరెస్టు చేశారు. ఆమెను ఢిల్లీ ఆర్ఎల్ ఎమ్ ఆస్పత్రికి తీసుకెళ్లి, టెస్టులు చేయగా ఆమె కడుపులో సుమారు 91 కొకైన్ ట్యాబ్లెట్లను దాచుకొని తరలించడాన్ని గుర్తించారు.

Omicron AP : ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు

ఆమె కడుపుతోని కొకైన్ ట్యాట్లెట్లను బయటికి తీయడానికి మూడు రోజుల సమయం పట్టింది. సుమారు 992 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అధికారులు అరెస్టు చేశారు. ఆర్ఎల్ ఎమ్ ఆస్పత్రి వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆమె కడుపులో నుంచి కొకైన్ పిల్స్ ను బయటికి తీశారు.

పొత్తి కడుపులో ప్లాస్టిక్ కవర్ లో కొకైన్ పిల్స్ దాచుకుంది. ఒక్కొక్క కవర్ లో సుమారు 9 గ్రాములు ఉండే విధంగా మొత్తం 91 పిల్స్ ను కడుపులో దాచుకుని అక్రమంగా తరలిస్తూ ఎయిర్ పోర్టులో అస్వస్థతగా కనిపించింది. రెండు, మూడు రోజుల క్రితమే విదేశాల నుంచి ఇందిరాగాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.

Anantapur News: అనంతపురం జిల్లాలో జింకల వేట కలకలం: నలుగురు వేటగాళ్లు అరెస్ట్

కాగా, ఇంత పెద్ద మొత్తంలో కొకైన్ సీజ్ చేయడం ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఇది రెండోసారి. డిసెంబర్ 9న లావోస్ నుంచి దుబాయ్ మీదుగా ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఉంగాండా మహిళ నుంచి 2,838 గ్రాముల కొకైన్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం మీద డ్రగ్స్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో కస్టమ్స్ అధికారులు సక్సెస్ అయ్యారు. ఈ ఏడాదిలో డ్రగ్స్ సీజ్ చేసిన వాటిలో ఇది 24వ కేసని అధికారులు తెలిపారు. మొత్తం 32 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వీరి నుంచి మొత్తం రూ. 845 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.