కారుతో బైక్ ను ఢీకొట్టాడు : మద్యం మత్తులో టీడీపీ నేత కుమారుడు హల్ చల్

విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులో అర్ధరాత్రి టీడీపీ నేత కుమారుడు హల్చల్ చేశాడు. మద్యంమత్తులో అతివేగంగా కారును నడిపి బీభత్సం సృష్టించాడు.

  • Published By: veegamteam ,Published On : December 15, 2019 / 04:09 AM IST
కారుతో బైక్ ను ఢీకొట్టాడు : మద్యం మత్తులో టీడీపీ నేత కుమారుడు హల్ చల్

విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులో అర్ధరాత్రి టీడీపీ నేత కుమారుడు హల్చల్ చేశాడు. మద్యంమత్తులో అతివేగంగా కారును నడిపి బీభత్సం సృష్టించాడు.

విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులో అర్ధరాత్రి టీడీపీ నేత కుమారుడు హల్చల్ చేశాడు. మద్యంమత్తులో అతివేగంగా కారును నడిపి బీభత్సం సృష్టించాడు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు… ఫుల్లుగా మందుకొట్టి కారు డ్రైవ్ చేశాడు. ఒళ్లు తెలియని స్పీడ్‌లో వెళ్లి ఓ బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో ఆ బైకిస్టు తీవ్రంగా గాయపడ్డారు. అయినా స్పీడ్‌ కంట్రోల్ చేయలేకపోవడంతో డివైడర్‌ పైనుంచి దూసుకెళ్లిన కారు… పొట్టిశ్రీరాములు విగ్రహానికి ఢీకొట్టింది. దీంతో కారు ధ్వంసమైంది. ప్రమాదం సమయంలో కారులో అప్పలనాయుడుతోపాటు మాజీ డీఐజీ కుమారుడు సూర్యదేవర మౌర్య, మరో వ్యక్తి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

శనివారం (డిసెంబర్ 14, 2019) అర్ధరాత్రి బాలకృష్ణ సినిమా రూలర్ ఆడియో లాంచ్ జరిగింది. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడుతోపాటు మాజీ డీఐజీ కుమారుడు సూర్యదేవర మౌర్య, ప్రణయ్ అనే మరో వ్యక్తి అక్కడికి వెళ్లారు. ఆడియో ఫంక్షన్ ముగించుకుని నోవాటల్ ప్రాంతంలో విందు చేసుకున్నారు. విందు అనంతరం కారులో వెళ్తున్నారు. ఆర్ కే బీచ్ రోడ్డులో అతివేగంగా వెళ్తున్న క్రమంలో ఏపీ 37సీవీ0780 నెంబర్ గల బైక్ ను ఢీకొట్టారు.

బైక్ అడ్డురావడంతో దాన్ని తప్పించబోయి డివైడర్ పై నుంచి దూసుకెళ్లిన కారు పొట్టిశ్రీరాములు విగ్రహాన్ని ఢీకొట్టింది. కారు టీడీపీ నేత కుమాడిదిగా గుర్తించారు. ప్రమాద ఘటన తర్వాత టీడీపీ నేత కుమారుడు కారు వదిలి పరారయ్యాడు. టూవీలర్ నడుపుతున్న వ్యక్తికి స్వల్పగాయాలు కావడంతో అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘర్షణ నేపథ్యంలోనే బండరాయి తీసుకొచ్చి కారుపై వేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బీచ్ రోడ్డులో జరిగిన కారు ప్రమాద ఘటన పలు సందేహాలకు తావిస్తోంది. ఘటన జరిగిప్పుడు అప్పలనాయుడుతోపాటు కారులోని వ్యక్తులకు, స్థానికులకు వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ సీటులో పెద్ద బండరాయి ఉంది. కారును రాయితో కొట్టినట్లు కనిపిస్తోంది. కారు నెంబర్ ప్లేట్ తీసేశారు. ప్రమాదం జరిగిన సమయంలో కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించివుంది. ఎమ్మెల్యే స్టిక్కర్ ను తీసేశారు. నెంబర్ ప్లేట్ ను కూడా తీసేశారు. బైకిస్టు నెంబర్ ప్లేట్ ఊడిపోయింది. బైకిస్టుకు స్వల్పగాయాలు కావడంతో అతన్ని వెంటనే కేజీహెచ్ కు తరలించారు.  ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ఇంటికి పంపించారు. 

టూవీలర్ నడుపుతున్న వ్యక్తితో గొడవ పడుతున్న క్రమంలో కారు టీడీపీ నేతదే అని గుర్తించిన స్థానికులు వారిపై తిరగబడ్డారు. దీంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. కారులో ప్రయాణిస్తున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది వచ్చి పూచికత్తుపై వారిని బయటికి తీసుకెళ్లారు. అనంతరం వారిని త్రిటౌన్ కు తీసుకొస్తున్నారు.