లారీ, పెట్రోల్, రక్తపు మరకలు : దిశ కేసులో కీలక మలుపు

దిశ అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నలుగురు నిందితులే దిశను హత్య చేసినట్లు సైబరాబాద్ పోలీసులు ఎన్ హెచ్ ఆర్ సీకి సాక్ష్యాలు ఇచ్చారు.

  • Published By: veegamteam ,Published On : December 10, 2019 / 06:05 AM IST
లారీ, పెట్రోల్, రక్తపు మరకలు : దిశ కేసులో కీలక మలుపు

దిశ అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నలుగురు నిందితులే దిశను హత్య చేసినట్లు సైబరాబాద్ పోలీసులు ఎన్ హెచ్ ఆర్ సీకి సాక్ష్యాలు ఇచ్చారు.

దిశ అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నలుగురు నిందితులే దిశను హత్య చేసినట్లు సైబరాబాద్ పోలీసులు ఎన్ హెచ్ ఆర్ సీకి సాక్ష్యాలు ఇచ్చారు. ఫోరెన్సిక్ ఆధారాలతో నివేదిక ఇచ్చారు. దిశ కేసులో శాస్త్రీయ ఆధారాలను ఎన్ హెచ్ ఆర్ సీ ముందు పెట్టారు. సంఘనా స్థలంలో దొరికిన రక్తం మరకలు, లారీ క్యాబిన్ లో దొరికిన రక్తం మరకలను నివేదిక ముందు పెట్టారు. డీఎన్ ఏ రిపోర్టుతోపాటు అన్ని నివేదికలు సమర్పించారు. రికార్డు సమయంలో ఆధారాలను సైబరాబాద్ పోలీసులు సమర్పించారు. ఘటనాస్థలంతోపాటుగా లారీ తిరిగిన సీసీ పుటేజీని ఎన్ హెచ్ ఆర్ సీకి ఇచ్చారు. కొత్తూరులో పెట్రోల్ కొనుగోలు చేసిన నిందితుల సీసీ పుటేజీని పోలీసులు సమర్పించారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ ముమ్మరం చేసింది. నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను పిలిపించి వివరాలు తెలుసుకుంది. ఆ రోజు అసలేం జరిగింది? నిందితులు ఎలా దాడి చేశారు? పోలీసులు ప్రతిఘటించడానికి ఏం చేశారనే వివరాలు నమోదు చేసుకుంది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను విచారించిన తరువాత.. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు ఎన్‌కౌంటర్‌కు ముందు గాయపడ్డ పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్లింది. వారి వాంగ్మూలం కూడా నమోదు చేసింది.

వారికి చికిత్స అందిస్తున్న వైద్యుల నుంచి కూడా వివరాలు సేకరించారు ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు. దిశ హత్య నుంచి ఎన్‌కౌంటర్ వరకు అన్ని విషయాల్ని రికార్డ్‌ చేసుకున్నారు. అలాగే ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నిందితులకు పంచనామా చేసిన రెవెన్యూ అధికారులను కూడా మానవ హక్కుల కమిషన్‌ ప్రశ్నించింది. పంచనామాలో రాసిన ప్రాథమిక వివరాలపైనా ఆరా తీసింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశానికి వెళ్లిన క్లూస్‌ టీమ్‌.. వివరాలు సేకరించింది. 3D స్కానర్లలో ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలాన్ని చిత్రీకరించింది.

మరోవైపు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఏర్పాటైన సిట్‌ కూడా దర్యాప్తు ముమ్మరం చేసింది. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ సిట్‌ సభ్యులతో సమావేశమయ్యారు. ఇంటరాగేషన్‌లో భాగంగా నేడో, రేపో ఎన్‌కౌంటర్‌ ప్రదేశాన్ని సిట్‌ బృందం పరిశీలించే అవకాశముంది. ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులు, సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ఏం జరిగిందనే దానిపై వివరాలు సేకరించనున్నారు. ఎన్‌కౌంటర్‌ తర్వాత ఆధారాలు సేకరించిన అధికారులతో పాటు పంచనామా చేసిన అధికారులను కూడా విచారించబోతున్నారు. షాద్‌నగర్ పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్‌ను కూడా పరిశీలిస్తారు. చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరు… దానికి దారితీసిన పరిస్థితులపై సిట్‌ దర్యాప్తు చేసి కోర్టుకు నివేదిక సమర్పించనుంది.