Whatsapp Warning : వాట్సాప్ యూజర్లకు పోలీసుల హెచ్చరిక.. ఆ లింక్‌లు క్లిక్‌ చేయొద్దు

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆఫర్లు, డిస్కౌంట్ల పేరుతో అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. జనాల వీక్ నెస్ ను క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా వాట్సాప్ వేదికగా సైబర్ క్రిమినల్స్ చీటింగ్ చేస్తున్నారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. వాట్సాప్ యూజర్లకు వార్నింగ్ ఇచ్చారు. వాట్సాప్ లో వచ్చే ఆ లింక్ లను అస్సలు క్లిక్ చేయొద్దని చెబుతున్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

Whatsapp Warning : వాట్సాప్ యూజర్లకు పోలీసుల హెచ్చరిక.. ఆ లింక్‌లు క్లిక్‌ చేయొద్దు

Whatsapp Warning

Whatsapp Warning : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫ్రీ, ఆఫర్లు, డిస్కౌంట్ల పేరుతో అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. జనాల వీక్ నెస్ ను క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా వాట్సాప్ వేదికగా సైబర్ క్రిమినల్స్ చీటింగ్ చేస్తున్నారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. వాట్సాప్ యూజర్లకు వార్నింగ్ ఇచ్చారు. వాట్సాప్ లో వచ్చే ఆ లింక్ లను అస్సలు క్లిక్ చేయొద్దని చెబుతున్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

అమెజాన్‌ ప్రైమ్‌/ నెట్‌ఫ్లిక్స్‌ వంటి వీడియో లైవ్‌ స్ట్రీమింగ్ ఉచితం అంటూ లింక్‌లు మీ వాట్సాప్‌కు ఏమైనా వచ్చాయా? అయితే జాగ్రత్త అంటున్నారు పోలీసులు. మిమ్మల్ని ఆశ పెట్టే అలాంటి లింక్‌లపై అస్సలు క్లిక్‌ చేయొద్దని చెబుతున్నారు. ఇదో పెద్ద మోసమని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు స్పష్టం చేశారు. అమెజాన్‌ ప్రైమ్‌ను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా రెండు నెలల పాటు ఉచితంగా పొందొచ్చని, లైవ్‌ స్ట్రీమింగ్‌ కోసం లింక్‌పై క్లిక్‌ చేయండి అంటూ వస్తున్న సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సైబర్‌ కేటుగాళ్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆశలు చూపుతూ మీ పర్సనల్ డేటాను చోరీ చేసేందుకు ఇలాంటి హానికరమైన లింక్‌లను పెద్ద ఎత్తున వాట్సాప్‌ల్లో పంపిస్తున్నారని సైబర్ పోలీసులు వివరించారు. తద్వారా మీ బ్యాంకింగ్‌ సమాచారాన్ని సైతం చోరీ చేయవచ్చని ఢిల్లీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్‌లలో URL/లింక్‌ల రూపంలో వచ్చే ఈ సందేశాలపై క్లిక్‌ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

అలాగే, వాటిని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు పార్వార్డ్‌ చేయకుండా ఉండటం ద్వారా ఈ గొలుసును ఛేదించవచ్చని అంటున్నారు. ఇప్పటికే కొన్ని యాంటీ వైరస్‌ ఇంజెన్‌లు ఈ హానికరమైన లింక్‌లను గుర్తించి నిరోధించాయని పోలీసులు తెలిపారు.

ఈ రోజుల్లో ఏదీ ఊరికే రాదు. ఫ్రీ అంటూ ఊరించారు అంటే కచ్చితంగా దాని వెనుక ఏదో మోసం ఉండి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. అది నిజమో కాదో తెలుసుకోకుండానే గుడ్డిగా ఇతరులకు ఫార్వర్డ్ చెయ్యడం కరెక్ట్ కాదు. మనతో పాటు మన వాళ్లని కూడా చిక్కుల్లో పడేసినట్టు అవుతుంది. అందుకే, సోషల్ మీడియాలో వచ్చే మేసేజ్ ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటికి 100సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సైబర్ నిపుణులు అంటున్నారు.