Y.S.Vivekananda Reddy : వివేకా ఇంటిని పరిశీలించిన సీబీఐ అధికారులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు.

Y.S.Vivekananda Reddy : వివేకా ఇంటిని పరిశీలించిన సీబీఐ అధికారులు

Ys Viveka Case Cbi

Y.S.Vivekananda Reddy :  మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. అధికారులు ఈరోజు పులివెందులలోని ఆయన ఇంటిని పరిశీలిస్తున్నారు. వివేకానందరెడ్డి ఇంటి పరిసరాలను ఫోటోలు వీడియోలు తీస్తూ సర్వేయర్ ద్వారా కొలతలు తీసుకుంటున్నారు. అంతకు ముందు వారు సీఎం జగన్ క్యాంపు కార్యాలయం, వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి పరిసరాలను పరిశీలించి ఫోటోలు వీడియోలు తీశారు.

పులివెందులలోని ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో వివేకానందరెడ్డి పీఏ ఇనయతుల్లాను విచారించారు.  అనంతరం ఇనయతుల్లాతో పాటు  ప్రభుత్వ సర్వేయరు, విఆర్ఓ, ప్రైవేట్ ఫోటో గ్రాఫర్ ను సీబీఐ అధికారులు తమ వాహనాల్లో వెంటబెట్టుకొని పలు ప్రాంతాలు తిరిగారు. ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్ బయట కొలతలు తీసుకుని ప్రతి అంశాన్ని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.

అనంతరం వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, దొండ్లవాగు శంకర్ రెడ్డి ఇండ్ల వద్ద సర్వే చేసి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.  భరత్ యాదవ్, ఈసీ గంగిరెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైయస్ వివేకానంద రెడ్డి, ఇండ్ల వద్ద సర్వే చేసి   ఫోటోలు, వీడియోలు చిత్రీకరించారు.  ఆ తర్వాత వైయస్ వివేకానంద రెడ్డి ఇంటి సమీపంలో వీడియోలు తీస్తూ సర్వే చేసారు.

Also Read : Lovers Suicide : విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం