Cyber Criminals : పెళ్లి పేరుతో రూ.2 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

పెళ్లి చేసుకునే నెపంతో యువతితో మాట్లాడించి, ఓ యువకుడి వద్దనుంచి సైబర్ నేరగాళ్లు రూ.2 లక్షలు కాజేసిన ఉదంతం సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది.

Cyber Criminals : పెళ్లి పేరుతో రూ.2 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

Cyber Criminals

Cyber Criminals :  పెళ్లి చేసుకునే నెపంతో యువతితో మాట్లాడించి, ఓ యువకుడి వద్దనుంచి సైబర్ నేరగాళ్లు రూ.2 లక్షలు కాజేసిన ఉదంతం సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది.  మెట్టుగూడకు చెందిన విక్రమ్ అనే యువకుడు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంతో తన ప్రోఫైల్ ఒక మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో నమోదు చేసుకున్నాడు.

ఇటీవల   విక్రమ్ కు   ఓ విదేశీ నెంబరు నుంచి ఫోన్ వచ్చింది.  ఫోన్ చేసిన యువతి తన పేరు పమేలా బిందే అని.. యూకే లో స్ధిర పడ్డ ఎన్నారై కుటుంబం అని పరిచయం చేసుకుంది. నీకు అంగీకారమైతే  ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని మాటల్లోకి దింపింది.  పెళ్లి ఇండియాలోనే చేసుకుందామని…ఖర్చులు ఇతర అవసరాల కోసం డబ్బులు చెక్కు ద్వారా పంపిస్తానని నమ్మించింది.

అనతంరం ఎయిర్ పోర్ట్ నుంచి కస్టమ్స్ అధికారులమంటూ  రెండు సార్లు ఫోన్ చేసి అతని వద్దనుంచి రెండు లక్షలకు పైగా డబ్బును ట్రాన్సఫర్ చేయించుకున్నారు. అనంతరం వారికి ఫోన్ చేయగా వారి ఫోన్లు స్విచ్చాఫ్ రావటం మొదలయ్యాయి. దీంతో  మోసపోయానని గ్రహించిన  విక్రమ్ హైదరాబాద్  సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.