లంకలో నరమేథం : 359కి చేరిన మృతులు

  • Published By: venkaiahnaidu ,Published On : April 24, 2019 / 07:36 AM IST
లంకలో నరమేథం : 359కి చేరిన మృతులు

శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయినవారి సంఖ్య 359కి చేరింది.500ల మందికి పైగా తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. బాంబు పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు 58మందిని శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read : మాటల్లేవ్.. మైండ్ బ్లాంక్ : ఆయన పీల్చిన గాలి.. డబ్బాలో పెట్టి అమ్మేస్తున్నారు

దేశంలో పెద్ద సంఖ్యలో ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదులు ఇంకా ఉండవచ్చని, మరిన్ని పేలుళ్లు జరిగే అవకాశమున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని మంగళవారం రాత్రి శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే హెచ్చరించారు.అయితే ప్రధాని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే బుధవారం (ఏప్రిల్-24,2019) ఉదయం కొలంబోల్ మరో బాంబు పేలింది. సావోయ్ సినిమాస్ దగ్గర ఈ బ్లాస్ట్ జరిగింది.

ఈరోజు పేలిన బాంబుతో పేలుళ్ల సంఖ్య 8కి చేరింది. కాగా భద్రతాదళాల  అప్రమత్తంగా వ్యవహరించటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. భారీగా ఆస్తినష్టం జరిగింది. మరోవైపు ఈ దాడులకు పాల్పడింది తామేనని ఐసిస్ ఉగ్రసంస్థ అంగీకరించింది. ఉగ్రదాడులకు పాల్పడిన వారి ఫొటోలను విడుదల చేసింది.దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన ఐసిస్ ఉగ్రవాదు పన్నాగాలను గుర్తించేందుకు పోలీసులు, ఆర్మీ ముమ్మర తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీలలో భాగంగా ఇప్పటికే తొమ్మిది బాంబులను భద్రతాదళాలు నిర్వీర్యం చేసారు.
Also Read : విపక్షాలను చూస్తుంటే స్కూల్ పిల్లలు గుర్తుకొస్తున్నారు