Delhi : జేబు దొంగల ముఠా గుట్టు రట్టు-ఆరుగురు మహిళలు అరెస్ట్

జన సమ్మర్ధం కల మార్కెట్ ప్రాంతాలు, మెట్రో రైళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండులలో మాటు వేసి ప్రయాణికుల విలువైన సామాన్లు దొంగిలించే కిలాడీ లేడీ గ్యాంగ్ ను ఢిల్లీ పోలీసులు, స్పెషల్

Delhi : జేబు దొంగల ముఠా గుట్టు రట్టు-ఆరుగురు మహిళలు అరెస్ట్

Delhi Women Pick Pockets Arrested

Delhi : జన సమ్మర్ధం కల మార్కెట్ ప్రాంతాలు, మెట్రో రైళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండులలో మాటు వేసి ప్రయాణికుల విలువైన సామాన్లు దొంగిలించే కిలాడీ లేడీ గ్యాంగ్ ను ఢిల్లీ పోలీసులు, స్పెషల్ మెట్రో యూనిట్ అరెస్ట్ చేసింది. ఈ ముఠాకు చెందిన ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను లక్ష్మి, వర్ష, పూజ, శశి, అంచల్, యుమునగా గుర్తించారు.

మార్చి 30న ఢిల్లీలోని   ద్వారకాకు చెందిన రోహిత్ రాజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి  తీసుకున్నారు. ఢిల్లీలోని  ద్వారకా లో నివసించే  రోహిత్ రాజ్ మెట్రో రైలు ఎక్కేందుకు తన తల్లి తండ్రులు, సోదరుడితో కలిసి ఆనంద్ విహార్ మెట్రో స్టేషన్ కు చేరుకున్నారు. వారు లిఫ్టులో వెళుతుండగా అందులోనే ఉన్న ఐదుగురు ముఠా సభ్యుల మహిళలు బ్యాగ్ లో ఉన్న వ్యాలెట్ ను చోరీ చేసి పారిపోయారని ఫిర్యాదులో పేర్కోన్నాడు.

వ్యాలెట్ లో లక్ష రూపాయలు విలువైన రెండు బంగారు గొలుసులు, ఆధార్ కార్డ్, పాన్ కార్డులతో పాటు డెబిట్ కార్డు కొంత నగదు ఉన్నాయని తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజి  ఆధారంగా   ఐదు నుంచి ఆరుగురు మహిళలు నేరం చేసినట్లు గుర్తించారు. వారి కోసం గాలింపు చేపట్టగా, కాల్ రికార్డింగ్ ఆధారంగా నిందితులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ లో ఉన్నట్లు గుర్తించారు.  పోలీసులు ఆరుగురు మహిళలను హరిద్వార్ లో   అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి రూ. 30,000 నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.

Also Read : Nellore Court: నెల్లూరు కోర్టులో చోరీ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
తాము జన సమ్మర్ధం ఉండే మార్కెట్ ఏరియాలు, షాపింగ్ మాల్ లు, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో నేరాలకు పాల్పడతామని నిందితులు అంగీకరించారు. నిందితులు అల్పాదాయ వర్గాలకు చెందిన నిరుద్యోగ మహిళలని  పోలీసులు తెలిపారు. వీరిలో లక్ష్మి, వర్ష అనే మహిళలకి గతంలోనే నేర చరిత్ర ఉన్నట్టు వెల్లడైందని పోలీసులు తెలిపారు.