Tamil Nadu: మహిళా ప్రొఫెసర్‌పై దాడి.. నడి రోడ్డుపై లాక్కెళ్లి మరీ దుండగుడి దారుణం

అన్నా యూనివర్సిటీలో సీతా లక్ష్మి అనే 53 ఏళ్ల మహిళ ప్రొఫెసర్‌గా పని చేస్తుంది. ఆమె తిరుచ్చిలో ఆదివారం ఒక స్కూల్ దగ్గర రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో సెంథిల్ కుమార్ అనే వ్యక్తి ఆమెపై ఒక కలపతో తయారు చేసిన దుంగతో తలపై కొట్టాడు.

Tamil Nadu: మహిళా ప్రొఫెసర్‌పై దాడి.. నడి రోడ్డుపై లాక్కెళ్లి మరీ దుండగుడి దారుణం

Tamil Nadu: తమిళనాడులో దారుణం జరిగింది. ఒక దుండగుడు మహిళా ప్రొఫెసర్‌పై దాడి చేసి, రోడ్డుపై లాక్కెళ్లాడు. ఈ ఘటన తిరుచ్చిలో గత ఆదివారం జరగగా, ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నా యూనివర్సిటీలో సీతా లక్ష్మి అనే 53 ఏళ్ల మహిళ ప్రొఫెసర్‌గా పని చేస్తుంది.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు.. ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని ఆదేశం

ఆమె తిరుచ్చిలో ఆదివారం ఒక స్కూల్ దగ్గర రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో సెంథిల్ కుమార్ అనే వ్యక్తి ఆమెపై ఒక కలపతో తయారు చేసిన దుంగతో తలపై కొట్టాడు. తలకు గట్టిగా దెబ్బ తగలడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను నడి రోడ్డుపై, కాళ్లతో ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. అలా ఫుట్‌పాత్‌పైకి కొద్ది దూరం ఆమెను లాక్కుని వెళ్లాడు. ఆ తర్వాత ఆమె దగ్గరున్న బైక కీస్, మొబైల్ ఫోన్ వంటివి తీసుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటనను అక్కడి వాళ్లెవరో వీడియో తీశారు. సెంథిల్ వెళ్లిన తర్వాత నెమ్మదిగా లేచిన సీతా లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ జరిపి నిందితుడు సెంథిల్ కుమార్‌ను గుర్తించారు.

Visakhapatnam ODI: విశాఖ వన్డేకు పొంచి ఉన్న వర్షం ముప్పు.. 19న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్

అయితే, సెంథిల్ కుమార్ బైకుపై పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ, బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అతడి కాలు విరిగింది. తమిళనాడులోని పలమనేరులో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. కాలు విరిగినందువల్ల ప్రస్తుతం అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అనంతరం అతడిని జైలుకు తరలిస్తామని పోలీసులు తెలిపారు. నడిరోడ్డు మీదే ఒక మహిళను లాక్కెళ్లడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తమిళనాడులో వైరల్ అవుతోంది.