Karnataka : అమ్మకు బర్త్‌డే గ్రీటింగ్స్ చెప్పనివ్వని వార్డెన్-బాలుడు ఆత్మహత్య

కర్ణాటకలో  విషాద సంఘటన చోటు చేసుకుంది. హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న  ఓ బాలుడు  అమ్మ పుట్టినరోజునాడు  గ్రీటింగ్స్ చెపుదామనుకున్నాడు. హాస్టల్ వార్డెన్ అందుకు అంగీకరించక ఫోన్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెందిన బాలుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

Karnataka : అమ్మకు బర్త్‌డే గ్రీటింగ్స్ చెప్పనివ్వని వార్డెన్-బాలుడు ఆత్మహత్య

Karnataka boy suicide

Karnataka : కర్ణాటకలో  విషాద సంఘటన చోటు చేసుకుంది. హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న  ఓ బాలుడు  అమ్మ పుట్టినరోజు నాడు  గ్రీటింగ్స్ చెపుదామనుకున్నాడు. హాస్టల్ వార్డెన్ అందుకు అంగీకరించక ఫోన్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెందిన బాలుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇవాళ మా అమ్మ పుట్టినరోజు సార్ .. అమ్మతో మాట్లాడి గ్రీటింగ్స్ చెపుతాను.. ఒక్కసారి మొబైల్‌ ఇవ్వండి సార్ .. అని ప్రాధేయపడిన బాలుడికి హాస్టల్‌ వార్డెన్‌ నుంచి ఈసడింపులే ఎదురయ్యాయి. పుట్టినరోజు నాడు అమ్మకు శుభాకాంక్షలు కూడా చెప్పలేక పోయానని తల్లడిల్లిపోయిన ఆ పసి హృదయం అర్ధాంతరంగా తనువు చాలించింది.

వివరాల్లోకి వెళితే … బెంగుళూరు సమీపంలోని హోసకోటేకి చెందిన రమేష్. మంజుల దంపతుల కుమారుడు పూర్వజ్(14) ఉళ్ళాలలోని శారదా  విద్యానికేతన్ పాఠశాలలో 9వతరగతి  చదువుతున్నాడు. శనివారం పూర్వజ్ తల్లి మంజుల పుట్టిన రోజు.  తల్లితో ఒకసారి మాట్లాడతానని  మొబైల్ ఇవ్వాలని హాస్టల్ వార్డెన్ ను కోరాడు. అందుకు వార్డెన్ అంగీకరించలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన పూర్వజ్ శనివారం రాత్రి 12 గంటల వరకు  నిద్రపోకుండా గడిపాడు. అనంతరం హాస్టల్ గదిలో ఉరి  వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆదివారం ఉదయం పూర్వజ్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త హాస్టల్ లో కలకలం రేపింది. బాలుని ఆత్మహత్యకు విద్యా సంస్ధ ప్రిన్సిపాల్,  హాస్టల్ వార్డెనే కారణమని మంజుల సోదరుడు అరుణ్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  హస్టల్ లో పూర్వజ్ రూమ్ కు  వచ్చి పరిశీలించారు. అక్కడ లభించిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఆ సూసైడ్ నోట్ పలువురిని కంట తడిపెట్టించింది. ఆ డెత్ నోట్ లో  ‘అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరూ ఆనందంగా ఉండండి. పాఠశాలలో నా కోసం చెల్లించిన ఫీజును వెనక్కి తీసుకోండి. అంతేసి ఫీజులు కట్టి.. మీరు నన్ను దుఃఖంలో పడేశారు. ఎవరూ బాధపడవద్దు.’’ అని బాలుడు రాసిన మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పించాయి.