Rs.14 Lakh Cheating : ఫేస్ బుక్ లో పరిచయం రూ.14లక్షలు మోసం చేసిన సైబర్ నేరగాళ్లు

కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడి  నుంచి రూ.14లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. మోసపోయానని గ్రహించి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ యువకుడు.

Rs.14 Lakh Cheating : ఫేస్ బుక్ లో పరిచయం రూ.14లక్షలు మోసం చేసిన సైబర్ నేరగాళ్లు

Rs.14 Lakh Cheating

Rs.14 Lakh Cheating : కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడి  నుంచి రూ.14లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. మోసపోయానని గ్రహించి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ యువకుడు.

హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు పూర్తి చేసిన హైదరాబాద్, బోయిగూడకు చెందిన వినయ్ కుమార్ విదేశాల్లో ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నాడు. ఈక్రమంలో అతనికి ఫేస్ బుక్ లో జేమ్స్ అనే అతను పరిచయం అయ్యాడు. మీ చదువుకు తగ్గ ఉద్యోగం కెనడాలో ఇప్పిస్తానని నమ్మించాడు. ఫలానా వారిని సంప్రదించండి..వారు మీకు సహాయం చేస్తారని చెప్పి ఒక ఫోన్ నెంబరు ఇచ్చాడు.

వినయ్ కుమార్ ఆ నెంబరుకు ఫోన్ చేసాడు. కెనడాలో ఉద్యోగం రెడీగా ఉందని అయితే ముందుగా మీ పేరు రిజిష్ట్రేషన్ చేయించుకోవాలని.. ఆతర్వాత ప్రోసెసింగ్ చేస్తామంటూ నమ్మిస్తూ.. విడతల వారీగా అతడి వద్ద నుంచి రూ. 14లక్షలు  వసూలు చేశారు.

ఇంకా డబ్బు అడుగుతుండటంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు వినయ్ కుమార్ గురువారం సీసీఎస్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.