Uttar Pradesh: ఎన్‭కౌంటర్‭లో అతిక్ అహ్మద్ కొడుకు, సహాయకుడు హతం.. యూపీలో కలకలం

తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని, అంతుకు ముందు అతిక్ అహ్మద్ ఆవేదన వ్యాక్యం చేశారు. జైలుకు తీసుకెళ్తున్న ఆయనను మీడియా ప్రశ్నించగా.. ఫేక్ ఎన్‭కౌంటర్‭ల పేరుతో తన కుటుంబాన్ని హతమార్చే కుట్ర జరుగుతోందని, వాస్తవానికి తాను ఇప్పటికి ప్రాణాలతో ఉండడానికి కారణం మీడియానేనని అతిక్ అహ్మద్ అన్నారు.

Uttar Pradesh: ఎన్‭కౌంటర్‭లో అతిక్ అహ్మద్ కొడుకు, సహాయకుడు హతం.. యూపీలో కలకలం

Encountered spot in up

Updated On : April 13, 2023 / 4:05 PM IST

Uttar Pradesh: ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్‭ని ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం ఎన్‭కౌంటర్‭లో హతమార్చారు. ఝాన్సీ జిల్లాలో ఈ ఘటనలో అతడి సహాయకుడు గులాం సైతం హతమయ్యాడు. హతమైన ఇద్దరు గ్యాంగ్‭స్టర్లని పోలీసులు చాలా రోజుల క్రితమే రికార్డు చేశారు. అంతే కాకుండా వారిపై ఐదు లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. ఉమేశ్ పాల్ హత్య జరిగినప్పుడు సంగటన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలకు అసద్, గులాం చిక్కారు. దీని ఆధారంగానే వారిపై తాజా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Maheshwar Reddy: కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు

ఈరోజు మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందంపై గులాం విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడని, పోలీసులు ప్రతీకార చర్యకు దిగడంతో ఇద్దరు మరణించారని ఒక పోలీసు అధికారి తెలిపారు. వారి నుంచి అధునాతన ఆయుధాలు, సెల్‌ఫోన్‌లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఉమేష్ పాల్ హత్య తర్వాత అసద్ అహ్మద్ లక్నోకు పారిపోయాడని పోలీసు వర్గాలు తెలిపాయి. అతను ఢిల్లీ చేరుకోవడానికి ముందు కాన్పూర్.. అటు నుంచి మీరట్‌కు వెళ్లినట్లు తెలిసింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌కు పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఝాన్సీకి చేరుకుని బైక్‌పై రాష్ట్ర సరిహద్దుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అసద్ మారువేషంలో ఉన్నట్లు సమాచారం. అతిక్ అహ్మద్ గ్యాంగ్‌లో ఒక ఇన్‌ఫార్మర్ ఉన్నాడని, అతను అసద్ ఆచూకీ గురించి చెప్పాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

Karnataka Elections: బీజేపీలో చేరితేనే తన బిడ్డను కాపురానికి పంపిస్తానంటూ అల్లుడికి ఝలక్ ఇచ్చిన మామ.. ఎక్కడంటే..?

ఇద్దరు డీఎస్పీ-ర్యాంక్ అధికారుల నేతృత్వంలోని 12 మంది బృందం ఈ ఆపరేషన్‌ను నిర్వహించిందని పోలీసులు తెలిపారు. ఝాన్సీలోని బబీనా రోడ్డులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం 42 రౌండ్లు కాల్పులు జరిగాయట. అదే హత్య కేసులో అతిక్ అహ్మద్‌ను కోర్టులో హాజరుపరిచి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపిన రోజే ఈ ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకేసులో ఉమేష్ పాల్ అనే న్యాయవాది సాక్షి. ఫిబ్రవరి 24న, ప్రయాగ్‌రాజ్‌లోని తన ఇంటి వెలుపల పగటిపూట దాడిలో కాల్పుల్లో మరణించాడు. అతడికి రక్షణగా ఉన్న భద్రతా సిబ్బంది కూడా చనిపోయారు. దాడికి సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విజువల్స్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై అనేక ప్రశ్నలను ప్రశ్నలకు లేవనెత్తడమే కాకుండా, ప్రభుత్వంపై అనేక విమర్శలు వచ్చాయి.

YCP MLA Perni Nani: మీ మామను తిట్టాలనుకుంటే డైరెక్టుగా తిట్టు.. మాతో ఎందుకు తిట్టిస్తావ్ హరీష్..

ఇక ఈ ఇద్దరిని హతమార్చడంపై ఉమేశ్ పాల్ తల్లి శాంతి దేవి హర్షం వ్యక్తం చేశారు. తన కొడుకు ఇది నివాళి అని అన్నారు. అంతే కాకుండా తమకు న్యాయం అందించారంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‭కి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని నేరస్తులకు ఇదొక హెచ్చరిక అని, ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటే పరిణామాలు ఇలాగే ఉంటాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు. అయితే తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని, అంతుకు ముందు అతిక్ అహ్మద్ ఆవేదన వ్యాక్యం చేశారు. జైలుకు తీసుకెళ్తున్న ఆయనను మీడియా ప్రశ్నించగా.. ఫేక్ ఎన్‭కౌంటర్‭ల పేరుతో తన కుటుంబాన్ని హతమార్చే కుట్ర జరుగుతోందని, వాస్తవానికి తాను ఇప్పటికి ప్రాణాలతో ఉండడానికి కారణం మీడియానేనని అతిక్ అహ్మద్ అన్నారు.