Ganja Seized : గుంటూరులో గంజాయి ముఠా అరెస్ట్ : రూ. 11 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి పదిలక్షల విలువ చేసే గంజాయి, లక్షన్నర విలువచేసే లిక్విడ్ గంజాయి, మూడుకార్లు, 5

Ganja Seized : గుంటూరులో గంజాయి ముఠా అరెస్ట్ : రూ. 11 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

Arif Hafeez

Ganja Seized : గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి పదిలక్షల విలువ చేసే గంజాయి, లక్షన్నర విలువచేసే లిక్విడ్ గంజాయి, మూడుకార్లు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

గుంటూరు జిల్లాలో   ఈ మధ్యకాలంలో    కేటుగాళ్లు   గంజాయి   ఎక్కువగా సరఫరా చేస్తున్నారు. కాలేజీలు విద్యా సంస్ధలు  ఎక్కువగా ఉండటంతో అక్రమార్కులు  భారీగా  గుంటూరుకు  గంజాయి తరలించి ఇక్కడి నుండి ఇతర రాష్ట్రాలకు   స్మగ్లింగ్  చేస్తున్నారు.

దీనిపై  గత  కొద్ది కాలంగా అర్బన్  యస్పీ ఆరిఫ్ హఫీజ్ ప్రత్యేక ద్రుష్టి పెట్టారు.  మూలాలను కనుక్కోవాలని అదికారులను ఆదేశించారు. సిద్దాబత్తుల వినయ్, కుర్రా వెంకటేష్ అనే వ్యక్తులు విశాఖ జిల్లాలో పాడేరులో గంజాయిని కొనుగోలు చేసి కార్లలో గుంటూరుకు తరలిస్తారు. ఇక్కడినుండి ఇతర రాష్టాలకు అబూబకర్ చేరవేస్తూవుంటాడు.

Also Read : Kadapa ATM Theft Case : కడపలో ఏటీఎంల చోరీ కేసులో నిందితుల అరెస్ట్

అబూబకర్ నుండి ఇసాక్ వామన్, మహమ్మద్ ఇషాన్  అనేవారు కేరళ, కర్నాటక రాష్ట్రాలలో గంజాయిని విక్రయిస్తున్నారు.  గుంటూరు బైపాస్ రోడ్డు వద్ద కార్లలో  గంజాయిని మారుస్తుండగా పోలీసులు  దాడి చేసి పట్టుకున్నారు. వీరి వద్దనుండి పది లక్షల విలువచేసే గంజాయి, లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  గంజాయికి  అక్రమ రవాణాకు వాడుతున్న కార్లను సీజ్ చేశారు. వీరిని రిమాండ్‌కి తరలించారు.