న్యాయం చేయండి : ఎగ్జిబిషన్ సొసైటీ వద్ద ఉద్రిక్తత

  • Published By: madhu ,Published On : January 31, 2019 / 05:23 AM IST
న్యాయం చేయండి : ఎగ్జిబిషన్ సొసైటీ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ తమను నిండా ముంచిందని…వ్యాపారం చేద్దామని వచ్చిన తాము ప్రమాదం కారణంగా రోడ్డుపై పడ్డామని…తమను ఆదుకోవాలని వ్యాపారస్తులు వేడుకుంటున్నారు. జనవరి 30వ తేదీ బుధవారం రాత్రి ఎగ్జిబిషన్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో వందకు పైగా స్టాళ్లు కాలి బూడిదయ్యాయి. భారీగా ఆస్తినష్టం సంభవించింది. ప్రమాదం సమాచారం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

ఈ ఎగ్జిబిషన్‌లో వ్యాపారం చేసేందుకు వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడకు వచ్చారు. అగ్నిప్రమాదంలో పూర్తిగా వస్తువులు కాలిపోయాయని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ జనవరి 31 గురువారం ఉదయం సొసైటీ ఆఫీసుకు వచ్చారు. లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడకు వచ్చి…ప్రమాదంలో పూర్తిగా లాస్ అయ్యాయమని కన్నీళ్ల పర్యంతమయ్యారు. ప్రభుత్వం..సొసైటీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

అక్కడకు చేరుకున్న పోలీసులు వ్యాపారస్తులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ ఒక్క అధికారి కూడా వచ్చి మాట్లాడలేదని కోపం వ్యక్తం చేస్తున్నారు. రూ. 25 నుండి రూ. 30 లక్షల రూపాయల మేర వస్తువులు కాలిపోయాయని..తాము ఎలా బతకాలని వారు పేర్కొంటూ అక్కడే బైఠాయించారు. మరి వీరిని సొసైటీ, ప్రభుత్వం ఆదుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి.