Hyderabad : వ్యాపారం పేరుతో రూ.13 కోట్లు మోసం చేసిన ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని  క్యూబా డ్రైవిన్ ఫుడ్ కోర్ట్‌‌లో పెట్టుబడి పెడితే   భారీగా లాభాలు ఇస్తానని పలువురిని నమ్మించి   13 కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోక నిందితుడు పరారీలో ఉన్నాడు.

Hyderabad : వ్యాపారం పేరుతో రూ.13 కోట్లు మోసం చేసిన ఇద్దరు అరెస్ట్

Hyderabad : హైదరాబాద్ లోని  రెస్టా రెంట్లో  పెట్టుబడి పెడితే   భారీగా లాభాలు ఇస్తానని పలువురిని నమ్మించి   13 కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోక నిందితుడు పరారీలో ఉన్నాడు.

నాగిల్ల జసంత్ అనే వ్యక్తి   బంజారా హిల్స్‌లో   క్యూబా డ్రైవ్  ఇన్ రెస్టా రెంట్ నిర్వహిస్తున్నాడు. అతని తండ్రి  రూఫస్ నాగిల్ల  చర్చి పాస్టర్‌గా పని చేస్తున్నాడు. రూఫస్  చర్చికి వచ్చిన వారి వద్ద నుంచి  తమ రెస్టారెంట్ లో డబ్బులు పెట్టుబడి పెట్టమని కోరేవాడు. తమ  వ్యాపారంలో  భాగస్వాములైతే  లాభాలు బాగా ఇస్తానని  పలువురి వద్ద నుంచి  భారీగా డబ్బులు వసూలు చేశాడు. డబ్బులు తీసుకుని ఎప్పటీకీ లాభాలు ఇవ్వకపోయే సరికి బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తమపై కేసు నమోదైందని తెలియటంతో రూఫస్ కుటుంబంతో సహా పరారయ్యాడు. పోలీసులు గాలింపు చేపట్టి కేసులో ప్రధాన నిందితుడు నాగిల్ల జసంత్, అతని తల్లి నాగిల్ల సుకన్యను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తండ్రి రూఫస్ నాగిల్ల పరారీలో ఉన్నాడు. అతని కోసం సీసీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. నిందితులిద్దరిపై  పలుపోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Also Read : Udaipur Murder : ఉదయ్ పూర్ నిందితులకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్ధతో లింకులు