ఇంటర్ మార్కులు తారుమారు : బోర్డు ఎదుట విద్యార్ధుల ఆందోళన

క్లాస్ ఫస్ట్ గా ఉన్న తన కుమార్తెకు.. 6 మార్కులు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని వారంటున్నారు. ఉదయం నుంచి విద్యార్ధులు

  • Published By: chvmurthy ,Published On : April 20, 2019 / 07:26 AM IST
ఇంటర్ మార్కులు తారుమారు : బోర్డు ఎదుట విద్యార్ధుల ఆందోళన

క్లాస్ ఫస్ట్ గా ఉన్న తన కుమార్తెకు.. 6 మార్కులు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని వారంటున్నారు. ఉదయం నుంచి విద్యార్ధులు

ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మార్కులు తారుమారు అయ్యాయంటూ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు కొందరు స్టూడెంట్స్. మార్కులు తారుమారు చేశారని, మెమోల్లోనూ తప్పులున్నాయని అంటూ ఏప్రిల్ 20వ తేదీ శనివారం ఉదయం నుంచి విద్యార్ధులు, వారి తల్లి దండ్రులతో ధర్నాకి దిగారు. అధికారులు నిర్లక్ష్యానికి ఇప్పటికే కొందరు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారని తల్లితండ్రులు ఆరోపించారు.  

అన్ని సబ్జెక్టుల్లో 90 శాతంకి పైగా మార్కులు వచ్చినా.. లెక్కలు పేపర్ -2లో సింగిల్ డిజిట్ మార్కులు వేశారని ఓ విద్యార్ధిని కన్నీళ్ల పర్యంతమయ్యింది. క్లాస్ ఫస్ట్ గా ఉన్న తన కుమార్తెకు.. 6 మార్కులు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని వారంటున్నారు. ఉదయం నుంచి విద్యార్ధులు తల్లితండ్రులతో ఆందోళన చేపట్టినప్పటికీ బోర్డుకు సంబంధించిన అధికారులు ఎవరూ వీరికి సమాధానం చెప్పటానికి ముందుకు రాలేదు. కేవలం ముగ్గురు విద్యార్ధుల విషయంలో మాత్రమే మార్కులు తారుమారయ్యాయని బోర్డు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

పరీక్షకు హాజరైన విద్యార్దులకు ఆబ్సెంట్ అని, పరీక్ష రాయకుండా ఆబ్సెంట్ అయిన పిల్లలకు.. ఎగ్జామ్ పాస్ అయినట్లు ఇంటర్ బోర్డు మెమోలు జారీ చేసిందని తల్లి తండ్రులు ఆరోపించారు. మార్కుల్లోనే కాక , సబ్జెక్ట్ ల్లో కూడా  తారుమారు చేశారని నిలదీస్తున్నారు. ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్య సంవత్సరాన్ని కోల్పోతున్నామని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.