Jubilee Hills Gang Rape : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా మైనర్ల విచారణ

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మైనర్లకు మూడోరోజు విచారణ ముగిసింది. పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ పై దృష్టి పెట్టారు.

Jubilee Hills Gang Rape : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా మైనర్ల విచారణ

Jubilee Hills Gang Rape

Updated On : June 12, 2022 / 7:54 PM IST

Jubilee Hills Gang Rape : జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మైనర్లకు మూడోరోజు విచారణ ముగిసింది. ముగ్గురు మైనర్లకు మూడో రోజు కస్టడీ విచారణ ముగియగా.. ఇద్దరు మైనర్లకు రెండో రోజు కస్టడీ విచారణ ముగిసింది. ఇవాళ్టి విచారణ సమయంలో పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ పై దృష్టిపెట్టారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

సీసీ ఫుటేజీ ఆధారంగా ఏ-1 సాదుద్దీన్ మాలిక్ ను విచారించారు. ఇక అతడు చెప్పిన సమాధానాలను మైనర్లు చెప్పిన విషయాలతో క్రాస్ చెక్ చేసుకున్నారు పోలీసులు. మరోవైపు ఐదుగురు మైనర్లను తీసుకెళ్లిన పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. ఇవాళ్టి విచారణ ముగియడంతో ఐదుగురు మైనర్లను సైదాబాద్ జువైనల్ హోమ్ కు తరలించారు.

Jubilee Hills Gang Rape : జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌..ఆ రోజు ఏం జరిగిందంటే?!

మరోవైపు జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో రోజుకో విస్తుపోయే విషయం వెలుగు చూస్తోంది. ఈ కేసులో బాధితురాలి మెడికల్ రిపోర్ట్ కీలకంగా మారింది. బాలిక శరీరంపై 12 గాయాలు ఉన్నట్లు వైద్యులు ఇచ్చిన రిపోర్టులో ఉంది. బాలిక మెడపై నిందితులు కొరికిన గుర్తులు ఉన్నాయి. మైనర్ బాలిక‌ మెడపై తీవ్రంగా కొరకడం, రక్కడంతో గాయాలయ్యాయి. బాలిక మెడపై టాటూలా ఉండాలనే, మెడపై కొరికినట్లు నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు.

Jubilee Hills Gang Rape : జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసు-టాటూ లా ఉండాలనే మెడపై కొరికాము