కుప్పం సరిహద్దుల్లో దారుణ హత్య.. భూవివాదంతో తహసీల్దారును కత్తితో పొడిచి చంపిన రిటైర్డ్ హెడ్మాస్టర్

  • Published By: bheemraj ,Published On : July 9, 2020 / 11:30 PM IST
కుప్పం సరిహద్దుల్లో దారుణ హత్య.. భూవివాదంతో తహసీల్దారును కత్తితో పొడిచి చంపిన రిటైర్డ్ హెడ్మాస్టర్

కుప్పం సరిహద్దుల్లో దారుణ హత్య జరిగింది. కర్ణాటక రాష్ట్రం బంగారుపేటలో భూవివాదంతో రిటైర్డ్ హెడ్మాస్టర్.. తహసీల్దారును చంపేశాడు. కలవంచి గ్రామంలో ప్రభుత్వ భూమిని సర్వే చేయడానికి వెళ్లిన తహసీల్దారు చంద్రమౌళీశ్వర్ ను రిటైర్డ్ హెడ్మాస్టర్ వెంకటచలపతి కత్తితో పొడిచాడు. చికిత్స కోసం చంద్రమౌళీశ్వర్ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు. తహసీల్దారు హత్యపై కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప స్పందించారు. హత్యపై సమగ్ర విచారణకు ఆదేశించారు.

కుప్పం సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏకంగా తహసీల్దారును మట్టుబెట్టిన సంఘటన కొద్దిసేపటి క్రితమే కర్ణాటకలో చోటు చేసుకుంది. ప్రధానంగా పెద్దకామ సముద్రం గ్రామంలో భూమికి సంబంధించి పెద్ద వివాదం ఉంది. గతంలో కూడా అనేకమార్లు ఇదే తహసీల్దారు అక్కడ సర్వేకు వెళ్తే రిటైర్డ్ హెడ్మాస్టర్ వెంకటచలపతి చాలాసార్లు వివాదానికి దిగారు.

మరోసారి ఆ భూమి సర్వే కోసం తహసీల్దారు ఆ గ్రామానికి వెళ్లారు. ఈ ఘటనను పథకం ప్రకారం ఆలోచించిన వెంకటచలపతి తన వద్ద దాచుకున్న కత్తితో ఒక్కసారిగా తహసీల్దారు గుండెలో పొడిచారు. దాంతో ఒక్కసారిగా తహసీల్దారు కుప్పకూలారు. అతనిని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించిగా అక్కడకు వెళ్లే లోగా మృత్యువాత పడ్డారు.

ఈ ఘటనను కర్ణాటక సర్కారు చాలా సీరియస్ తీసుకుంది. ప్రభుత్వానికి, వెంకటాచలపతికి చాలా కాలంగా భూ వివాదం కొనసాగుతుంది. ఈవాళ సర్వే కోసమే తహసీల్దారు గ్రామానికి వెళ్లారు. కాని ఒక్కసారిగా వెంకటాచలపతి ఇంత దారుణానికి ఒడికడతాడని ఎవ్వరూ కూడా ఊహించలేదు. కేవలం ఒక్క భూ వివాదంలో ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందనే అక్కసుతో ఇంత దారుణానికి ఒడిగట్టారు.

హాస్పిటల్ కు తరలించేలోగా తహసీల్దారు మృత్యువాత పడ్డాడు. ఎవరైతే దారుణానికి ఒడిగట్టారో వెంకటాచలపతిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. ఈ విషయంలో కర్ణాటక సర్కారు కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. స్వయంగా ఎడ్యూరప్ప వచ్చి విచారణ కూడా ఆదేశించారు.