ప్రేమను తిరస్కరించిందని ప్రియురాలిని చంపబోయి ప్రియుడు మృతి

ప్రేమను తిరస్కరించిందని ప్రియురాలిని చంపబోయి ప్రియుడు మృతి

lover poured petrol on his girlfriend and set her on fire, she holds on to him tightly while on fire : ప్రేమను తిరస్కరించిందని ప్రియురాలిని చంపబోయి ప్రియుడు మృతిచెందిన ఘటన ముంబై లోచోటు చేసుకుంది. మేఘావాడి ప్రాంతంలో నివసించే విజయ్ ఖాంబే అనే వ్యక్తి తన బావ చెల్లెలితో రెండున్నరేళ్లుగా ప్రేమలో ఉన్నాడు.

ఎలాగూ చుట్టరికం ఉంది కనుక పెళ్లి చేసుకోమని కోరాడు. కానీ విజయ్ మద్యపాన అలవాటు కారణంగా మహిళ కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించలేదు. ఈనేపధ్యంలో అతడు ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించసాగాడు. ఈక్రమంలో ఆమె ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

కుటుంబ సభ్యులు వెంటనే గమనించి ఆమెను ఆస్పత్రిలో చేర్చటంతో  ప్రాణాపాయం నుంచి బయటపడింది. వారం రోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చింది. కాగా ఇంట్లో ఆమె ఒక్కతే ఉందని తెలుసుకున్న విజయ్ ఈనెల 6వ తేదీన ఆమెను పరామర్శించటానికి వచ్చినట్లు ఇంటికి వచ్చి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

వెంటనే ఆమె ఆ మంటలతో అతడ్నిగట్టిగా పట్టుకుని వాటేసుకుంది. దీంతో నిందితుడికి కూడా మంటలు అంటుకున్నాయి. ఇద్దరూ  ఆర్తనాదాలు చేయటంతో  చుట్టుపక్కల వారు వచ్చి  మంటలార్పి ఇద్దరినీ ఆస్పత్రికి  తరలించారు.  కాలిన గాయాలతో   విజయ్ మరణించగా, మహిళ పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.