Cyber Fraud: భారీ లాభాల పేరుతో వ్యాపారికి టోకరా.. రూ.14 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

ఉత్తర ప్రదేశ్, లక్నోకు చెందిన ఒక వ్యాపారి ఒక ప్రైవేటు సంస్థలో పెట్టుబడులు పెట్టాలనుకున్నాడు. దీనికోసం వెతికితే, ఒక సంస్థ పేరుతో వెబ్‌సైట్ కనిపించింది. అందులోని వివరాలు కూడా అతడికి నచ్చాయి. దీంతో తన డీటైల్స్ అందులో ఎంటర్ చేశాడు. తర్వాత అతడికి ఆ కంపెనీ నుంచి వాట్సాప్‌లో ఒక లింక్ వచ్చింది.

Cyber Fraud: భారీ లాభాల పేరుతో వ్యాపారికి టోకరా.. రూ.14 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

Cyber Fraud: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఒక వ్యాపారికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. పెట్టుబడుల పేరుతో మోసం చేసి, అతడి వద్ద నుంచి రూ.14 లక్షలు కొట్టేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్, లక్నోకు చెందిన ఒక వ్యాపారి ఒక ప్రైవేటు సంస్థలో పెట్టుబడులు పెట్టాలనుకున్నాడు.

WPL-2023: మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం.. మహిళలకు టిక్కెట్లు ఉచితం

దీనికోసం వెతికితే, ఒక సంస్థ పేరుతో వెబ్‌సైట్ కనిపించింది. అందులోని వివరాలు కూడా అతడికి నచ్చాయి. దీంతో తన డీటైల్స్ అందులో ఎంటర్ చేశాడు. తర్వాత అతడికి ఆ కంపెనీ నుంచి వాట్సాప్‌లో ఒక లింక్ వచ్చింది. ఆ లింక్‌పై క్లిక్ చేసి తన బ్యాంక్ డీటైల్స్ ఇచ్చాడు. అతడికి ప్రతి నెలా రూ.50,000 చొప్పున పెట్టుబడులు పెడితే, మంచి లాభాలుంటాయని నమ్మించారు. ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. అలా ప్రతి నెలా రూ.50,000 ఇన్వెస్ట్ చేసి, కొంతకాలం ఆగితే మంచి లాభాలు వస్తాయన్నారు.

Mumbai Division: ముంబైలో టిక్కెట్ లేని ప్రయాణికుల నుంచి రూ.100 కోట్ల జరిమానా వసూలు చేసిన రైల్వే

దీంతో ఇది నిజమని నమ్మిన ఆ వ్యాపారి రూ.14 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే, తనకు ఎంతకాలమైనా లాభాలు రాలేదు. దీనిపై వాళ్లను సంప్రదించినా లాభం లేకపోయింది. పెట్టుబడి తిరిగి రాక.. లాభమూ లేక.. చివరకు తాను మోసపోయానని గుర్తించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇలాంటి ఫేక్ వెబ్‌సైట్లు, లింక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.