One Sided Love : వన్ సైడ్ లవ్-ప్రేమించిన యువతినిచ్చి పెళ్లి చేయలేదని….

పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న యువతిని ఒక యువకుడు ప్రేమించాడు. ఆ అమ్మాయి ఇష్టాఇష్టాలు తెలుసుకోకుండా ఆమెనిచ్చి పెళ్లిచేయమని కోరాడు. పెద్దలు అంగీకరించకపోవటంతో బాలికను హత్య చేశాడు.

One Sided Love : వన్ సైడ్ లవ్-ప్రేమించిన యువతినిచ్చి పెళ్లి చేయలేదని….

Man Killed Lover

One Sided Love : పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న యువతిని ఒక యువకుడు ప్రేమించాడు. ఆ అమ్మాయి ఇష్టాఇష్టాలు తెలుసుకోకుండా ఆమెనిచ్చి పెళ్లిచేయమని కోరాడు. పెద్దలు అంగీకరించకపోవటంతో బాలికను హత్య చేశాడు.

తమిళనాడులోని తంజై జిల్లా పట్టుకోట్టైకి చెందిన పాండ్యన్ కుమార్తె మౌనిక(18) తిరువారూర్ జిల్లా ముత్తుపేట పట్టణ పంచాయతీకి చెందిన ప్రాంతంలో ఉన్న తమ బంధువుల ఇంట్లో ఉంటూ తిరుచ్చి పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతోంది.

ఈ క్రమంలో మౌనిక బంధువు అయిన ముత్తుపేట, తిరుకలూర్ గ్రామానికి చెందిన శివశంకర్ (28) అనే యువకుడు మౌనికను వన్‌సైడ్ లవ్ చేసినట్లు తెలిసింది. మౌనికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆమె తల్లి తండ్రులను కోరాడు. అందుకు వారు అంగీకరించలేదు.

దీంతో ఆగ్రహించిన శివశంకర్ శనివారం రాత్రి రాజకుమారి ఇంట్లోకి వెళ్లి నిద్రిస్తున్న మౌనిక ముఖంపై బండరాయితో విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో మౌనిక అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు శివశంకర్ ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.