టక్కరీ దొంగ : ఆన్‌లైన్‌లో కారును అమ్మేస్తాడు.. అదే కారును తిరిగి దొంగిలిస్తాడు.. అలా 5 సార్లు..

టక్కరీ దొంగ : ఆన్‌లైన్‌లో కారును అమ్మేస్తాడు.. అదే కారును తిరిగి దొంగిలిస్తాడు.. అలా 5 సార్లు..

Man sells car online on OLX : దొంగదారిలో డబ్బు సంపాదించేందుకు మోసగాళ్లు రోజుకో కొత్త దారి వెతుకుంటున్నారు. ఆన్ లైన్ మోసాలకు ఓలెక్స్ అడ్డాగా మార్చుకుంటున్నారు మోసగాళ్లు. ఘాజియాబాద్ కు చెందిన ఓ మోసగాడు.. మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ మోడల్ కారును ఆన్ లైన్‌లో అమ్మేసి అదే కారును పలుమార్లు దొంగిలించాడు. కారును అమ్మినట్టే అమ్మి కొనుక్కున్న ఒక్కొక్కరి నుంచి ఐదు సార్లు దొంగిలించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

Man sells car online on OLX and steals it back 5 times : యూపీలోని ఘాజియాబాద్ కు చెందిన ప్రశాంత్ త్యాగీ (23) అనే యువకుడిగా పోలీసులు గుర్తించారు. తాను అమ్మిన కారును జీపీఎస్ ట్రాకర్ అమర్చి.. ఆ విషయాన్ని కొనుగోలుదారులకు చెప్పేవాడు కాదు.. కారును ఓలెక్స్ లో అమ్మకానికి పెట్టేవాడు.. కారు డెలివరీ అయి తన చేతికి డబ్బులు అందాక జీపీఎస్ ట్రాకర్ ద్వారా కారును వెంబడించి మళ్లీ దొంగిలించేవాడు. ఇలా ఐదుసార్లు మారు తాళంతో కారును దొంగిలించాడు.

ఆన్ లైన్ లో కారును అమ్మేముందు ఫేక్ రిజిస్ట్రేషన్ కారు వివరాలను ఇచ్చి బేరం కుదర్చుకునేవాడు. అలా ఐదుగురికి ఒకే కారును అమ్మేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఆ కారు నిందితుడు ప్రశాంత్ ది కాదు.. తన బంధువుల కారు.. తన కారుగా చెప్పుకొని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టేవాడు. కవి నగర్ కు చెందిన ఒక వ్యక్తికి ఇదే కారును 1.4 లక్షలకు డీల్ కుదర్చుకున్నాడు.

ఆ తర్వాత జీపీఎస్ ట్రాకర్ ద్వారా కారు లొకేషన్ గుర్తించి తన దగ్గర ఉన్న రెండో కీతో దొంగిలిస్తున్నాడని పోలీసులు విచారణలో వెల్లడైంది. చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు. గత ఏడాదిలో కూడా ఇదే నిందితుడు ఈజీ మనీ కోసం పలువురిని మోసగించాడు. మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ అండ్ డిజైర్ కారును 14 సార్లు ఒక్కొక్కరికి అమ్మి దొంగిలించాడు.