Mangaluru Blast : కుక్కర్ బాంబ్‌తో ఫోటో, బస్టాండ్‌లో పేలుడుకు ప్లాన్.. మంగళూరు బాంబ్ బ్లాస్ కేసులో సంచలన నిజాలు

సంచలనం రేపిన మంగళూరు ఆటోరిక్షా బాంబ్ బ్లాస్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాఫ్తు చేస్తున్న కొద్దీ పేలుడు కేసులో సంచలన వాస్తవాలు బయటపడుతున్నాయి.

Mangaluru Blast : కుక్కర్ బాంబ్‌తో ఫోటో, బస్టాండ్‌లో పేలుడుకు ప్లాన్.. మంగళూరు బాంబ్ బ్లాస్ కేసులో సంచలన నిజాలు

Mangaluru Blast : సంచలనం రేపిన మంగళూరు ఆటోరిక్షా బాంబ్ బ్లాస్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాఫ్తు చేస్తున్న కొద్దీ పేలుడు కేసులో సంచలన వాస్తవాలు బయటపడుతున్నాయి.

మంగళూరు పేలుడు కేసు నిందితుడు షరీఖ్ కు ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రభావంలో ఉన్నాడని ఇప్పటికే గుర్తించిన పోలీసులు.. కుక్కర్ బాంబ్ తో నాగూరి బస్టాండ్ లో బ్లాస్ట్ కు ప్లాన్ చేసినట్లు సమాచారం. పేలుడుకు ముందు శివమొగ్గలో ట్రయల్స్ నిర్వహించిన షరీఖ్.. శివమొగ్గలో పలు మార్లు రెక్కీ చేసినట్లు తేల్చారు. కుక్కర్ బాంబును ఇంట్లోనే తయారు చేసినట్లు గుర్తించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కుక్కర్ బాంబును సిద్ధం చేశాక దాంతో ఫోటో దిగాడు షరీఖ్. బాంబు తయారీకి కావాల్సిన పేలుడు పదార్దాలను ఆన్ లైన్ లో కొనుగోలు చేశాడు. పేలుడు ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న షరీఖ్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నారు కర్నాటక పోలీసులు.

శనివారం(నవంబర్ 19) సాయంత్రం మంగళూరు మైసూర్‌ శివారులో ఓ ఆటోలో ఉన్నట్లుండి పేలుడు సంభవించిన ఘటన.. ప్రమాదం కాదని, ఉగ్రకోణం ఉందని తేలడంతో కర్నాటక ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పైగా అంతర్జాతీయ ఉగ్రసంస్థ ప్రమేయం బయటపడడంతో.. విస్తృత దర్యాప్తు ద్వారా తీగ లాగే యత్నంలో ఉంది కర్నాటక పోలీస్‌ శాఖ. ఈ క్రమంలో.. పేలుడులో గాయపడ్డ మహమ్మద్‌ షరీఖ్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు.

శివమొగ్గ జిల్లా తీర్థాహల్లికి చెందిన షరీఖ్‌.. ఆటోలో డిటోనేటర్‌ ఫిక్స్‌ చేసిన ప్రెషర్‌ కుక్కర్‌ బాంబుతో ప్రయాణించారు. మంగళూరు శివారులోకి రాగానే అది పేలిపోయింది. దీంతో ఆటో డ్రైవర్‌తో పాటు షరీఖ్‌ గాయపడ్డాడు. ప్రస్తుతం నగరంలోని ఓ ఆస్పత్రిలో అతనికి చికిత్స అందుతోంది. ఇది ముమ్మాటికీ ఉగ్ర చర్యగానే ప్రకటించిన పోలీసు శాఖ.. కేంద్ర సంస్థలతో కలిసి దర్యాప్తు చేపడుతోంది. నగరంలో విధ్వంసం సృష్టించే ఉద్దేశంతోనే షరీఖ్‌ యత్నించినట్లు భావిస్తున్నారు.

24 ఏళ్ల వయసున్న షరీఖ్‌పై ఓ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ప్రభావం ఉందని పోలీసులు తెలిపారు. కర్నాటక బయట అతనికి ఉన్న లింకులను కనిపెట్టేందుకు పోలీస్‌ శాఖ ప్రయత్నిస్తోంది.

సుమారు 45 శాతం కాలిన గాయాలతో మాట్లాడలేని స్థితిలో చికిత్స పొందుతున్నాడు షరీఖ్. మైసూర్‌లో షరీఖ్‌ అద్దెకు ఉంటున్న ఇంట్లో అగ్గిపెట్టెలు, పాస్పరస్‌, సల్ఫర్‌, నట్లు-బోల్ట్ లు లభించాయి. ఆ ఇంటి ఓనర్‌ మోహన్‌ కుమార్‌కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారించారు. ఇక ప్రేమ్‌ రాజ్‌ అనే పేరుతో ఫేక్‌ ఆధార్‌ కార్డు తీసి.. ఆ గుర్తింపుతో దాడులకు యత్నించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.