Minor girl stabbed to death: స్కూలు బాలికపై కత్తిపోట్లు.. ఆమె మృతి చెందాక యువకుడి ఆత్మహత్య
ఓ పాఠశాల బాలికను ఓ యువకుడు దారుణంగా చంపేశాడు. ఆ బాలికపై కత్తితో దాడి చేసి అనంతరం అతడూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హర్యానాలోని రేవారీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ బాలిక మృతదేహం జాతీయ రహదారికి సమీపంలో లభ్యమైందని పోలీసులు వివరించారు. పాఠశాలకు వెళ్లిన తమ కూతురు తిరిగి రాలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.

Minor girl stabbed to death: ఓ పాఠశాల బాలికను ఓ యువకుడు దారుణంగా చంపేశాడు. ఆ బాలికపై కత్తితో దాడి చేసి అనంతరం అతడూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హర్యానాలోని రేవారీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ బాలిక మృతదేహం జాతీయ రహదారికి సమీపంలో లభ్యమైందని పోలీసులు వివరించారు. పాఠశాలకు వెళ్లిన తమ కూతురు తిరిగి రాలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.
వారి ఫిర్యాదు ఆధారంగా బాలిక కోసం గాలిస్తున్న తమకు జాతీయ రహదారి వద్ద ఆమె మృతదేహం లభ్యమైందని చెప్పారు. ఆమె మృతదేహంపై కత్తిపోట్లను గుర్తించామని అన్నారు. అక్కడి సమపంలోని రైల్వే ట్రాక్ పై యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్న చోటే అమ్మాయి స్కూటీ కనపడిందని చెప్పారు. ఆ స్కూటీపై రక్తపు మరకలు ఉన్నాయని వివరించారు.
అలాగే, ఆ అమ్మాయి స్కూల్ బ్యాగు, ఆమెను చంపేందుకు యువకుడు వాడిన కత్తి లభ్యమయ్యాయని తెలిపారు. ఆమెపై అత్యాచారం జరగలేదని చెప్పారు. ఆ అమ్మాయిని యువకుడు ఎందుకు చంపాడన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మరింత స్పష్టతవచ్చే అవకాశం ఉందని అన్నారు.
Phone Tapping In YCP : నా గొంతు ఆగాలంటే నన్ను ఎన్‌కౌంటర్ చేయండి : కోటంరెడ్డి