Facebook : నకిలీ ఫేస్ బుక్ ఖాతా ద్వారా లక్ష రూపాయలు కాజేసిన సైబర్ నేరగాడు

Facebook : నకిలీ ఫేస్ బుక్ ఖాతా ద్వారా లక్ష రూపాయలు కాజేసిన సైబర్ నేరగాడు

Facebook2

Facebook : కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనా సైబర్ నేరగాళ్లు మాత్రం తమ కార్యకలాపాలు మాత్రం ఆపటంలేదు.లాక్ డౌన్ కష్టాలు వెళ్లబోసుకుంటూ ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బంధువున లక్షరూపాయలకు మోసంచేసిన ఘటన ముంబై లో వెలుగు చూసింది.

ముంబైలో నివసించే మనోహర్ పారిక్ స్టేట్ రిజర్వ్ పోలీసు కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి మనోహర్ పారిక్ ఫోటో వివరాలతో నకిలీ ఫేస్బుక పేజిని క్రియేట్ చేశాడు.కరోనా లాక్ డౌన్ సమయంలో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానని వెంటనే వీలైనంత ధనసహాయం చేయాలని కోరుతూ అతని ఫ్రెండ్స్ కు , బంధువులకు వాట్సప్ మెసెంజర్ లో మెసేజ్ పంపించాడు.

అయ్యో పాపం మనోహర్ కష్టాల్లో ఉన్నాడనుకుని అతని స్నేహితుడు భూషణ్ పరివార్ వెంటనే మనోహర్ కు ఫోన్ చేశాడు. ఆ సమయంలో బిజీగా ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పలేక పోయాడు. స్నేహితుడు చాలా కష్టాల్లో ఉన్నాడనుకుని , వెంటనే భూషణ్ ఎంతకావాలని మెసెంజర్లో అడిగాడు. 15 వేలు పంపించమని మెసెంజర్ లో సమాధానం వచ్చింది. మోసగాడు అది తీసుకుని తన బ్యాంకు ఎకౌంట్ నెంబరు పంపించాడు.

ఈ క్రమంలో వారంరోజుల్లో మోసగాడు భూషణ్ వద్దనుంచి లక్ష రూపాయలు కాజేశాడు. లక్ష రూపాయలు తీసుకున్న తన మిత్రుడు ఫోన్ చేయలేదేంటని భూషణ్ మళ్లీ ఫోన్ చేసి డబ్బులు అందాయా అని మనోహర్ ను అడిగాడు. దీంతో షాక్ తిన్న మనోహర్ డబ్బులేమిటి అని భూషణ్ ను అడిగాడు. జరిగిన వ్యవహారం మొత్తం భూషణ్, మనోహర్ కు వివరించాడు. వెంటనే భూషణ్ వద్దకు వచ్చిన మనోహర్ తన పేరుమీద క్రియేట్ అయిన ప్రోఫైల్ చూసి అవాక్కయ్యాడు.

తన ఖాతాకు డబ్బులు రాలేదని చెప్పి ఇద్దరూ కలిసి ముంబై నార్త్ రీజియన్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లోఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతీసుకున్నపోలీసులు సంబంధింత బ్యాంకు మేనేజరును సంప్రదించారు. అప్పటికి భూషణ్ పంపించిన నగదు ఆ బ్యాంకు ఖాతాలో ఉంది. వెంటనే మేనేజర్ ఆ ఖాతాను స్తంభింపచేశారు. ఆ మొత్తాన్ని మనోహర్ ఖాతాకు బదిలీ చేశారు. కాగా ఈ కేసులో ఇంతవరకు పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. నిందితులను కనిపెట్టటానికి పోలీసులు గాలింపు చేపట్టారు.