న్యూజిలాండ్ లో పేలిన అగ్నిపర్వతం…ఐదుగురు టూరిస్టులు మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : December 9, 2019 / 04:11 PM IST
న్యూజిలాండ్ లో పేలిన అగ్నిపర్వతం…ఐదుగురు టూరిస్టులు మృతి

టూరిస్టుల కేంద్రంగా ప్రఖ్యాతి చెందిన న్యూజిలాండ్ లోని  వైట్ఐలాండ్ అగ్నిపర్వతం అకస్మాత్తుగా పేలింది. భారత కాలమారం ప్రకారం సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనేక మంది అక్కడ చిక్కుకుని పోయారు. ప్రమాదాన్ని న్యూజిలాండ్ ప్రధాని ధ్రువీకరించారు. 

తెల్లని దట్టమైన బూడిద రాశి ఆకాసంలో 3.6 కి.మీ ఎత్తున పైకెగసింది. ఇంకా అగ్ని పర్వతం నుంచి మరింత విస్ఫోటనం వెలువడే ప్రమాదం ఉందని, ఇప్పుడు ద్వీపానికి చేరుకోవడం చాలా ప్రమాదకరమని డిప్యూటీ పోలీస్ కమిషనర్ జాన్ టిమ్స్ చెప్పారు. పేలుడు సంభవించినప్పుడు అక్కడ దాదాపు 50 మంది టూరిస్టులు వైట్ ఐలాండ్‌ను సందర్శిస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఎక్కువ మంది ఆస్ట్రేలియన్లే అని చెప్పారు. రాత్రి అవుతున్న కొద్దీ అక్కడకెళ్లి సహాయక రక్షణ చర్యలు చేపట్టడం ఎంతో రిస్క్ అని తెలిపారు.