Bride Robbery : అన్నంలో మత్తు మందు కలిపి డబ్బు, నగలతో పారిపోయిన కొత్త కోడలు

రాజస్ధాన్ లోని ఒక కుటుంబానికి వచ్చిన కొత్త కోడలు ఇల్లు లూటీ చేసిపారిపోయింది. కొడలిగా   ఇంటికి వచ్చిన రెండో రోజే అత్తింటివారికి మత్తు మందు పెట్టి ఇంట్లోని నగదు బంగారం తీసుకుని పరారయ

Bride Robbery : అన్నంలో మత్తు మందు కలిపి డబ్బు, నగలతో పారిపోయిన కొత్త కోడలు

Rajasthan Bride

Bride Robbery : కొత్తకోడలు ఇంటికి వస్తోందంటే ఆమె ద్వారా ఆ ఇంట్లో మంచి జరగాలని అందరూ కోరుకుంటారు. కానీ… రాజస్ధాన్ లోని ఒక కుటుంబానికి వచ్చిన కొత్త కోడలు ఇల్లు లూటీ చేసిపారిపోయింది. కొడలిగా   ఇంటికి వచ్చిన రెండో రోజే అత్తింటివారికి మత్తు మందు పెట్టి ఇంట్లోని నగదు బంగారం తీసుకుని పరారయిన ఘటన వెలుగు చూసింది.

జైపూర్  జిల్లా కోట్ పుట్లీ, కృష్ణా టాకీస్ ప్రాంతంలో నివసించే నందు పట్వా తన కుమారుడికి ఫిబ్రవరి 22న పూజారాణి అనే యువతితో పెద్దల సమక్షంలో లక్ష్మీ నారాయణ ఆలయంలో వివాహం జరిపించారు.
ఆ తర్వాత పూజారాణి అత్తారింటికి(నందుపట్వా) వచ్చింది. అంతా సంతోషంగా ఉన్నారు. కోడలు వచ్చినప్పటి నుంచి ఆమె చేతి వంట కుటుంబ సభ్యులు తింటున్నారు.

వివాహం జరిగిన రెండు రోజులకు శుక్రవారం రాత్రి కూడా పూజారాణే వంట చేసింది. ఆరాత్రి అందరికీ కొసరి కొసరి వడ్డించింది. అంతా భోజనం చేశారు కానీ ఆమె తినలేదు. భోజనం చేసిన కాసేపటికి ఇంట్లోని కుటుంబ సభ్యులు స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత పూజా ఇంట్లోని కుటుంబ సభ్యుల మొబైల్స్, ఇంట్లో ఉన్న నగదు, బంగారం తీసుకుని పారిపోయింది. పూజారాణి అన్నంలో మత్తు మందుకలిపి పెట్టటంతో వారంతా మత్తులోకి జారుకున్నారు.

మర్నాడు ఉదయం నందు పట్వా కుటుంబ సభ్యులు ఎవరూ బయటకు రాకపోవటంతో ఇరుగు పొరుగు వారు తలుపులు కొట్టి చూశారు. ఎంతసేపటికి రిప్లై రాకపోయేసరికి తలుపులు పగల గొట్టి చూశారు. ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read : Hyderabad Auto : హైదరాబాద్‌లో ఆటోలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్
ఘటనా స్ధలానికి వచ్చిన  పోలీసులు కుటుంబ సభ్యులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పెళ్లి సంబంధం కుదర్చటానికి మద్యవర్తికి రూ.1,50,000 నగదు ఇచ్చినట్లు యువకుడి తండ్రి నందు పట్వా చెప్పారు. కోట్‌పుట్లీ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితురాలి కోసం గాలిస్తున్నారు. పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తిని ఇతర వ్యక్తులను విచారిస్తున్నారు.