Odisha: కారును తనిఖీ చేసిన అధికారులకు షాక్.. బయటపడ్డ క్వింటాల్ వెండి ఇటుకలు.. పద్నాలుగు లక్షల నగదు

కారులో క్వింటాల్ వెండి ఇటుకలు, రూ.14 లక్షల నగదు అక్రమంగా తరలిస్తోంది ఓ ముఠా. ఎక్సైజ్ అధికారులు జరిపిన తనిఖీలో ఇవి బయటపడ్డాయి. గంజాయి ఉందేమో అన్న అనుమానంతో తనిఖీ చేస్తే వెండి, నగదు దొరికాయి.

Odisha: కారును తనిఖీ చేసిన అధికారులకు షాక్.. బయటపడ్డ క్వింటాల్ వెండి ఇటుకలు.. పద్నాలుగు లక్షల నగదు

Odisha: ఒడిశాలో అక్రమంగా నగదు, వెండి తరలిస్తున్న ముఠా గుట్టు రట్టైంది. గంజాయి ఉందేమో అన్న అనుమానంతో కారును తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారులకు దిమ్మదిరిగేలా సొమ్ము బయటపడింది. ఒడిశా, కటక్ జిల్లాలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Honour Killing: పరువు హత్య కేసు… కూతురును, ఆమె ప్రియుడిని చంపిన తల్లిదండ్రులు.. మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు

ఈ క్రమంలో స్థానిక తంగి టోల్ గేట్ దగ్గర పశ్చిమ బెంగాల్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఒక కారు అనుమానాస్పదంగా అనిపించింది. అందులో గంజాయి తరలిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు అనుమానించారు. దీంతో కారును ఆపి, క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కారులో బయటపడ్డ సొమ్ము.. కారులో వాటిని దాచిన విధానం చూసి అధికారులు షాక్ అయ్యారు. ఈ కారులో వంద కిలోలకుపైగా వెండి ఇటుకలు, రూ.14 లక్షల నగదు బయటపడింది. వీటిని తరలించేందుకు కారులోని ఇద్దరు నిందితులు చాలా తెలివిగా ప్రవర్తించారు. కారులో కొన్ని ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేశారు.

Uttar Pradesh Shocker: పాస్‌పోర్ట్ ఫొటో కోసం స్టూడియోకు వెళ్లిన అమ్మాయి.. ఒంటరిగా ఉండటంతో ఫొటోగ్రాఫర్ అసభ్య ప్రవర్తన

ప్రతి చాంబర్‌లో కొన్ని ఇటుకల చొప్పున మొత్తం చాంబర్లలో వంద కిలోలకు పైగా ఇటుకల్ని పేర్చారు. అలాగే నగదును కూడా అనేక చోట్ల సర్దారు. చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తేనే ఈ విషయం బయటపడింది. వీటిని స్వాధీనం చేసుకున్న అధికారులు, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, వీటిని పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్ పూర్ తరలిస్తున్నట్లు సమాచారం.