Boy Kidnapped And Sold : బాలుడిని కిడ్నాప్ చేసి రూ.10లకు విక్రయించిన వ్యక్తి అరెస్టు

హైదరాబాద్ సైదాబాద్ లో ఓ వ్యక్తి ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి రూ.10 విక్రయించాడు. సైదాబాద్ పోలీసులు ఈ కేసును మూడు రోజుల్లోనే చేధించారు. బాలుడిని విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.

Boy Kidnapped And Sold : బాలుడిని కిడ్నాప్ చేసి రూ.10లకు విక్రయించిన వ్యక్తి అరెస్టు

BOY

Boy Kidnapped And Sold : హైదరాబాద్ సైదాబాద్ లో ఓ వ్యక్తి ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి రూ.10 విక్రయించాడు. సైదాబాద్ పోలీసులు ఈ కేసును మూడు రోజుల్లోనే చేధించారు. బాలుడిని విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈమేరకు గురువారం సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో సౌత్, ఈస్ట్ జోన్ డీసీపీ రూపేశ్ వివరాలు వెల్లడించారు. శివరాత్రి సందర్భంగా పార్థ జంగయ్య, లక్ష్మీ అనే ఇద్దరు భిక్షాటన చేసుకోవడానికి హైదరాబాద్ కు వచ్చారు.

నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరిద్దరు భిక్షాటన చేసుకునేక్రమంలో వీరికి నల్లగొండ జిల్లా లింగోలంకు చెందిన కడమంచి పాండు (28) పరిచయం అయ్యారు.  ఈ నేపథ్యంలో పాండు మద్యం ఇప్పిస్తానని చెప్పడంతో లక్ష్మీ తన కుమారుడు రామ్ చరణ్ ను తీసుకొని చంపాపేట రాఘవేంద్ర వైన్స్ దగ్గరకు వెళ్లారు. ఆమెకు పాండు మద్యం ఇప్పించాడు. లక్ష్మీ మద్యం మత్తులో ఉండగా ఆమె వద్ద ఉన్న ఐదేళ్ల బాలుడు రామ్ చరణ్ ను పాండు ఎత్తుకుని తనతో పాటు తీసుకెళ్లాడు.

Tragedy : రంగారెడ్డి జిల్లాలో నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్, హత్య

తన కుమారుడు కనిపించడం లేదని బాధితురాలు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అడిషనల్ ఇన్ స్పెక్టర్ బండారు చంద్ర మోహన్ నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సీసీ ఫుటేజ్ దృశ్యాల ఆధారంగా బాలుడు ఆచూకీ తెలుసున్నారు. నల్గొండ జిల్లా మామిళ్లగూడెం ఎస్ఎల్ బీసీ కతల్ గూడకు చెందిన స్క్రాప్ వ్యాపారి నర్సింహ్మకు బాలుడిని రూ.10 వేలకు విక్రయించిన పాండు, తిరిగి హైదరాబాద్ కు వచ్చారు.

పాండును పోలీసులు అదుపులోకి విచారించగా బాలుడిని విక్రయించినట్లు అంగీకరించారు. నిందితుడు కడమంచి పాండు, నర్సింహ్మను పోలీసులు అరెస్టు చేశారు. బాలుడిని తల్లి లక్ష్మీకి అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును చేధించడంలో పోలీసులకు సహకరించిన మణితేజ, జెస్ పాల్ సింగ్, కిశోర్ లను డీసీపీ అభినందించారు.