వరంగల్‌ యువతి హత్యకు కారణమేంటో తేల్చిన పోలీసులు

వరంగల్‌ యువతి హత్యకు ప్రధాన కారణమేంటో పోలీసులు తేల్చారు. ప్రియురాలు తనకు దక్కకుండా పోతోందన్న కారణంతోనే హతమార్చినట్లు వెల్లడించారు.

  • Published By: veegamteam ,Published On : January 12, 2020 / 02:01 AM IST
వరంగల్‌ యువతి హత్యకు కారణమేంటో తేల్చిన పోలీసులు

వరంగల్‌ యువతి హత్యకు ప్రధాన కారణమేంటో పోలీసులు తేల్చారు. ప్రియురాలు తనకు దక్కకుండా పోతోందన్న కారణంతోనే హతమార్చినట్లు వెల్లడించారు.

వరంగల్‌ యువతి హత్యకు ప్రధాన కారణమేంటో పోలీసులు తేల్చారు. ప్రియురాలు తనకు దక్కకుండా పోతోందన్న కారణంతోనే హతమార్చినట్లు వెల్లడించారు. ప్రేమతో నమ్మించి అత్యాచారం చేసి అత్యంత పాశవికంగా గొంతు కోసి ప్రాణం తీసినట్లు తెలిపారు. మరోవైపు తమ కూతురి చావుకు కారణమైన వాడిని చంపేయాలంటూ బాధిత యువతి తల్లిదండ్రులు పోలీసులను వేడుకున్నారు. 

వరంగల్‌ యువతి హత్య కేసులో పోలీసులు దూకుడు పెంచారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించిన పోలీసులు…కేవలం తనకు దక్కట్లేదనే కారణంతోనే యువతిని హతమార్చినట్లు తేల్చారు. ప్రేమతో నమ్మించి ఒంటరిగా పిలిపించుకుని అత్యాచారం చేసి హత్య చేసినట్లు వెల్లడించారు. యువతిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి వీలైంత త్వరగా శిక్ష పడేలా చేసి…బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు. 

ఇటీవల యువతి మరో యువకుడితో  స్నేహంగా ఉండటాన్ని షాహిద్‌ జీర్ణించుకోలేకపోయాడని పోలీసులు తెలిపారు. ఆ విషయంపై ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయని…దానికి తోడు యువతికి సంక్రాంతి తర్వాత వివాహం చేసేందుకు సంబంధాలు చూస్తున్నట్టు తెలుసుకుని దారుణానికి ఒడిగట్టాడని అన్నారు. పైకి ప్రేమ నటిస్తూ…యువతిపై అత్యాచారానికి పాల్పడి గొంతు కోసి ప్రాణం తీసినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించి సాంకేతిక పరమైన ఆధారాలను సేకరించేపనిలో ఉన్నారు పోలీసులు.  

ఇన్నాళ్లు యువకుడిపై ఎలాంటి అనుమానం రాలేదని…తమ కూతురిపై అంతలా పగ పెంచుకుంటాడని ఊహించలేదని మృతురాలి తల్లి కన్నీరుమున్నీరైంది. తమ కూతురిని పొట్టనపెట్టుకున్న వాడిని చంపేయాలంటూ పోలీసులను వేడుకుంది. 

ఇక యువతి మృతదేహానికి పోస్టుమార్టం చేసే సమయంలో ఎంజీఎం ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతదేహాంతో పలువురు నాయకులు ధర్నా నిర్వహించారు. ఆందోళనల మధ్యలోనే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు. మరోవైపు మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించే సమయంలో హన్మకొండలోని కేయు క్రాస్ వద్ద ఆందోళనకారులు అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేశారు.