TSPSC Paper Leak : టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ లో వెలుగులోకి సంచలన విషయాలు

టీఎస్ పీఎస్ పీ పేపర్ లీక్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రేణుక ప్రభుత్వ టీచర్ గా పని చేస్తున్నారు. తమ్ముడి కోసం ప్రవీణ్ చేత రేణుక పేపర్ లీక్ చేయించారు.

TSPSC Paper Leak : టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ లో వెలుగులోకి సంచలన విషయాలు

TSPSC paper leak

TSPSC Paper Leak : టీఎస్ పీఎస్ పీ పేపర్ లీక్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఓ యువతి సోదరుడి కోసం ప్రవీణ్ పేపర్ లీక్ చేశాడు. రేణుక ప్రభుత్వ టీచర్ గా పని చేస్తున్నారు. తమ్ముడి కోసం ప్రవీణ్ చేత రేణుక పేపర్ లీక్ చేయించారు. దీంతో నెట్వర్క్ అడ్మిన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న రాజశేజర్ ను ప్రవీణ్ పేపర్ గురించి అడిగారు.

టౌన్ ప్లానింగ్ పేపర్ సెక్షన్ ఆఫీసర్ సిస్టమ్ లో ఉందని రాజశేఖర్ చెప్పారు. అనంతరం పెన్ డ్రైవ్ లో పేపర్ ను ప్రవీణ్ కాపీ చేసుకున్నారు. పేపర్ ప్రింట్ ను రేణుక కు ప్రవీణ్ ఇచ్చారు. పేపర్ ను సోదరుడికి చూపించి వెంటనే తెచ్చి ఇవ్వమని రేణుకకు ప్రవీణ్ చెప్పారు. డబ్బు మీద ఆశతో ఓ సర్పంచ్ కొడుకుకు రేణుక పేపర్స్ పంపారు. ఆ వ్యక్తి..మరో ముగ్గురు యువకులకు చెప్పడంతో రేణుక 3 నుండి రూ.14 లక్షల వసూలు చేశారు.

TSPSC Paper Leak : ఆ యువతి కోసమే.. TSPSC పేపర్‌ లీక్‌ వ్యవహారంలో సంచలన ట్విస్ట్‌

రేణుక 10 లక్షల రూపాయలను ప్రవీణ్ కు ఇచ్చారు. ప్రింట్ ఇచ్చిన పేపర్లను ప్రవీణ్ కాల్చి వేసినట్టు సమాచారం. సంవత్సరం నుండి ప్రవీణ్ తో రేణుక పరిచయం పెంచుకున్నారు. రేణుక తమ్ముడు ఎగ్జామ్ రాయడానికి పేపర్లు కావాలని ప్రవీణ్ ను రేణుక ఒత్తిడి చేశారు. ​రేణుక ఒత్తిడి చేయడంతో ప్రవీణ్ పేపర్లు బయటకి ఇచ్చారు.

రేణుక తమ్ముడు ఒక పేపర్ కు లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకు వసూలు చేశారు. ​18 మందికి ఆ పేపర్ అమ్మినట్టు రేణుక వెల్లడించారు. మిగిలిన జిరాక్స్ లను రేణుక కాల్చివేసింది. పేపర్లు కొన్న వారిలో తిరిగి ఒక్కరు జిరాక్సు చేసి అమ్మారు. ​17 మంది నిందితులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు.