ఢిల్లీలో కలకలం : కరోనా అనుమానిత రోగి ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

  • Published By: madhu ,Published On : March 19, 2020 / 02:23 AM IST
ఢిల్లీలో కలకలం : కరోనా అనుమానిత రోగి ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

భారతదేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. ఈ క్రమంలో కరోనా అనుమానితుడొకరు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు తన్వీర్ సింగ్ (35)గా గుర్తించారు. ఇతడు పంజాబ్ రాష్ట్రంలోని షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాలోని సియానా గ్రామానికి చెందిన వాడు. డెడ్ బాడీని ముట్టుకోవద్దని సీనియర్ వైద్యులు పోలీసులకు తెలిపారు. ముందుగా మృతదేహానికి పరీక్షలు నిర్వహించాలని డాక్టర్లు భావిస్తున్నారు. 

తన్వీర్ ఇటీవలే ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి విమానంలో భారత్‌లో దిగాడు. సంవత్సర క్రితం నుంచి అతను అక్కడే నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే..కరోనా వ్యాధి ప్రబలుతుండడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు వైద్యులు. అతడిని సప్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇతడిని నుంచి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. రిపోర్ట్స్ కోసం వైద్యులు ఎదురు చూస్తున్నారు. అయితే..ఐసోలేషన్ వార్డు తలుపులు బలవంతంగా తెరిచి ఆసుపత్రిలోని ఏడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారాన్ని పోలీసులకు తెలియచేశారు వైద్యులు. భారతదేశంలో ఇప్పటి వరకు 161 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ విజృంభిస్తుండడంతో ఉత్తర్ ప్రదేశ్, నోయిడాలో 144 సెక్షన్ విధించారు. 
Read More : ఏపీ ఎన్నికల కమిషనర్ పేరిట కేంద్ర హోం శాఖకు లేఖ..ఎవరు రాసుంటారు