నాకు అది కావాలి..లేదంటే నీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తా…ప్రియురాలిని బెదిరించిన ప్రియుడు

నాకు అది కావాలి..లేదంటే నీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తా…ప్రియురాలిని బెదిరించిన ప్రియుడు

Tamilnadu Youngman Threatens to share phtos, videos with girl friend after she refuses sexual favours, extorts Rs.15,000 : సోషల్ మీడియాలో పరిచయం అయిన యువతితో ప్రేమాయణం మొదలెట్టాడు ఓయువకుడు. అందులో భాగంగా చెట్టాపట్టాలేసుకుని రాష్ట్రాలు దాటి విహార యాత్రలు చేశారు. సన్నిహితంగా మెలిగారు. ఉన్నట్టుండి వారి లవ్ కు బ్రేకప్ చెప్పాడు. తర్వాతనుంచి వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు పంపి డబ్బులు డిమాండ్ చేయటం… తన కోరిక తీర్చమని బెదిరించటం మొదలెట్టాడు. తన కోరిక తీర్చకపోతే ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. విసుగెత్తిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తమిళనాడులోని  పుదుచ్చేరి లో నివసించే కార్తీ ఉద్యోగం, సద్యోగం లేక ఆవారాగా తిరుగుతుంటాడు. అతని ఫ్రెండ్ క్రియేట్ చేసిన వాట్సప్ గ్రూప్ లో చేరాడు. అతనికి అదే వాట్సప్ గ్రూప్ లో ఉన్న 20 ఏళ్ల యువతితో  పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమేపి ప్రేమగా మారింది. ఇద్దరూ చాటింగ్ చేసుకోవటం మొదలెట్టారు. ఇలా కాదని ఒకరినొకరు కలుసుకున్నారు.

ఇద్దరూ కలిసి పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలన్నీ తిరిగారు. నువ్వు లేక నేను లేను అన్న సాంగ్ టైప్ లో చెట్టాపట్టాలేసుకు తిరిగారు. అక్కడ ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. అత్యంత సన్నిహితంగా మెలిగారు.

ఇంతలో ఏమైందో ఏమో ఒకరోజు కార్తీ తన ప్రేమకు బ్రేకప్ చెప్పాడు. నీదారి నీది, నాదారి నాది, అన్నాడు. ఇద్దరూ విడిపోయారు. కొన్నాళ్లకు కార్తీ మళ్లీ ఆయువతికి ఫోన్చేసి తన కోరిక తీర్చమని అడిగాడు. అతడి మాటలు విని   షాకైన యువతి నో చెప్పింది.

తన కోరిక తీర్చకపోతే అంతకు ముందు ఇద్దరం సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో ఆమె  వద్ద నుంచి 15 వేల రూపాయలు తీసుకున్నాడు. ఆయువతి కూవత్తూర్ బస్టాండ్ వద్దకు వచ్చి అతనికి 15 వేలు ఇచ్చింది.

తర్వాత   కొద్దిరోజులకు  మళ్లీ ఫోన్ చేసి డబ్బులివ్వాలని బెదిరించాడు. ఆయువతి మళ్లీ 5వేల రూపాయలు కార్తీకి ఇచ్చింది.  రాను రాను కార్తీ అరాచకాలు పెరిగిపోతున్నాయి. మళ్లీ కొన్నాళ్లకు ఫోన్ చేసి తనకు పడక సుఖం అందించాలని, దానితోపాటు 50వేల రూపాయలు కావాలని అడిగాడు… లేకపోతే తన వద్ద ఉన్నఫోటోలు మీ అమ్మా,నాన్నలకు, చెల్లెలికి పంపిస్తానని బెదిరించాడు.

కార్తీ బెదిరింపులను అప్పటి దాకా భరించిన యువతి ఈవిషయాన్ని తన తల్లితండ్రులకు చెప్పింది. విషయం తెలుసుకున్న తల్లితండ్రులు  కార్తీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ జరుగుతోంది.