రన్ వే పై నుంచి అదుపుతప్పి…మూడు ముక్కలైన 177మంది ఉన్న విమానం

  • Published By: venkaiahnaidu ,Published On : February 5, 2020 / 06:15 PM IST
రన్ వే పై నుంచి అదుపుతప్పి…మూడు ముక్కలైన 177మంది ఉన్న విమానం

ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ లో పెద్ద విమాన ప్రమాదం జరిగింది. బుధవారం(ఫిబ్రవరి-5,2020)టర్కీకి చెందిన చౌక ధరల వియానయాన సంస్థ పెగసాస్ ఎయిర్‌లైన్స్ నడుపుతున్న బోయింగ్ 737… 177మంది ప్రయాణికులు,ఆరుగురు సిబ్బందితో ఇజ్మీర్ నుండి బయలుదేరింది. ఇస్తాంబుల్ లోని సబీహా గోకెన్ విమానాశ్రయంలో ఈ విమానం ల్యాండ్ అవ్వాల్పి ఉంది.

అయితే సబీహా గోకెన్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పిన విమానం రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లి పడిపోయింది. అనంతరం మంటలు చెలరేగి విమానం మూడు ముక్కలుగా విడిపోయింది. ఈ ప్రమాదంలో ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదని,అయితే చాలా మంది ప్రయాణికులకు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. గాయపడ్డ వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

ప్యాసింజర్లలో 12మంది చిన్నారులు కూడా ఉన్నారని టర్కీ మీడియాతెలిపింది. ఇద్దరు పైలెట్లు మాత్రం తీవ్రంగా గాయపడినట్లు టర్కీ మీడియా తెలిపింది. ఇద్దరు పైలెట్లలో ఒకరు టర్కీ దేశస్థుడు కాగా మరొకరు దక్షిణ కొరియాకు చెందినవారని తెలిపింది. విమాన ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

విమానం కిందపడిపోయిన తర్వాత మంటలు చెలరేగాయని.. ఎయిర్‌పోర్టు సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారని చెప్పారు. లేదంటే భారీగా ప్రాణ నష్టం జరిగేదని అభిప్రాయపడ్డారు. టర్కీలోని అతిపెద్ద నగరమైన ఇస్లాంబుల్ లో భారీ వర్షం,బలమైన గాలులు కారణంగా విమానం రన్ వే పై నేంచి అదుపుతప్పినట్లు తెలుస్తోంది.