Saleshwaram Stampede : నల్లమల సలేశ్వరం జాతరలో తొక్కిసలాట.. ఇద్దరు భక్తులు మృతి

నాగర్ కర్నూల్ జిల్లా వనపట్లకు చెందిన కుర్వ రాములతో కలిసి గొడుగు చంద్రయ్య(50) సలేశ్వరంలోని లింగమయ్య దర్శనానికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున రాయిపై నుంచి జారిపడుతుండగా గుండెపోటుకు గురై అక్కడికక్కకడే మృతి చెందాడు.

Saleshwaram Stampede : నల్లమల సలేశ్వరం జాతరలో తొక్కిసలాట.. ఇద్దరు భక్తులు మృతి

Saleshwaram Stampede

Saleshwaram Stampede : తెలంగాణలో నాగర్ కర్నూల్ జిల్లా నల్లమలలోని సలేశ్వరం జాతరలో అపశృతి చోటు చేసుకుంది. తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందారు. జాతరకు రెండో రోజు లక్షకుపైగా భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఊపరాడక ఒకరు మృతి చెందారు. గుండెపోటుతో మరొకరు మరణించారు.

నాగర్ కర్నూల్ జిల్లా వనపట్లకు చెందిన కుర్వ రాములతో కలిసి గొడుగు చంద్రయ్య(50) సలేశ్వరంలోని లింగమయ్య దర్శనానికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున రాయిపై నుంచి జారిపడుతుండగా గుండెపోటుకు గురై అక్కడికక్కకడే మృతి చెందాడు.

Tamil Nadu : తమిళనాడు ధర్మలింగేశ్వర ఆలయ ఉత్సవాల్లో అపశృతి.. వాటర్ ట్యాంక్ లో పడి ఐదుగురు మృతి

మృతదేహాన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.  అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా ఆమన్ గల్ కు చెందిన విజయ(40) లోయలో దర్శనానికి వెళ్తుండగా భక్తుల రద్దీ కారణంగా ఊపిరాడక మృతి చెందారు.

మరికొందరు గాయ పడ్డారని తెలుస్తోంది. మరోవైపు మృతుల కుటుం సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుల గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.