Justice Priyanka Reddy : చట్టాలు కఠినతరం చేస్తాం – కిషన్ రెడ్డి

  • Published By: madhu ,Published On : November 30, 2019 / 10:35 AM IST
Justice Priyanka Reddy : చట్టాలు కఠినతరం చేస్తాం – కిషన్ రెడ్డి

ప్రియాంక రెడ్డి హత్య అత్యంత హేయమయినది..మానవసమాజం సిగ్గుతో తలదించుకునేల ఉంది ఘటన..హీనంగా ప్రియాంక రెడ్డి పట్ల ప్రవర్తించిన మృగాళ్లకు కఠినంగా శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. నవంబర్ 30వ తేదీ శనివారం పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

కేంద్రం ప్రవేశపెట్టిన యాప్‌ను అమలు పరచాలని తెలంగాణ ప్రభుత్వానికి కోరుతున్నట్లు తెలిపారు. నిందితులను క్షమించే సమస్య లేదని స్పష్టం చేశారు. జియో ట్యాగింగ్ 112 యాప్ ను వాడుకోవాలని ప్రజలకు సూచించారు. డిసెంబర్ 02వ తేదీన ఎమర్జెన్సీ సపోర్ట్ సిస్టం యాప్ పై పార్లమెంట్‌లో స్వయంగా నేనే మాట్లాడబోతున్నట్లు తెలిపారు. పొక్సో చట్టాన్ని మార్చేయడం వల్ల..వరంగల్ ఘటనలో నిందితుడికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకున్నామన్నారు.

ఎవరైనా పోలీసుస్టేషన్‌కు వస్తే తమ లిమిట్స్ కాదని అనకుండా ప్రతి కంప్లైంట్ పైన స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నపిల్లల, మహిళలపై జరిగే దాడులపై చట్టాలు కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఎంతో వేగంగా నిందితులని అరెస్ట్ చేశారని, అదే స్థాయిలో నిందితులకు కఠినంగా శిక్ష పడేలా ప్రభుత్వం చేస్తుందని అనుకుంటున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయం కావాలన్నా తామివ్వడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 
Read More : అక్క కాదు.. చెల్లి కాదు.. ఎలాంటి బంధం లేదు.. అయినా వాళ్లను చంపేస్తాం