ఇన్సూరెన్స్ డబ్బు కోసం బాబాయినే చంపేశాడు

ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం ఓ కిరాతకుడు దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి తర్వాత తండ్రిని పొట్టనపెట్టుకున్నాడు. నల్గొండ జిల్లాలో గత నెలలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • Published By: veegamteam ,Published On : February 15, 2020 / 08:09 AM IST
ఇన్సూరెన్స్ డబ్బు కోసం బాబాయినే చంపేశాడు

ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం ఓ కిరాతకుడు దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి తర్వాత తండ్రిని పొట్టనపెట్టుకున్నాడు. నల్గొండ జిల్లాలో గత నెలలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అతడో లారీ క్లీనర్‌.. తల్లిదండ్రులు లేకపోవడంతో ఒక్కడే ఒంటరిగా ఉండేవాడు. సీన్‌కట్‌ చేస్తే…ఓ రోజు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంపై చేపట్టిన దర్యాప్తులో దిమ్మతిరిగే విషయాలు బయటపడ్డాయి. పక్కా ప్లాన్‌తో అతడిని హతమార్చినట్లు తేల్చారు. మర్డర్‌ వెనకున్న మిస్టరీని తెలుసుకుని పోలీసులే షాక్‌కు గురయ్యారు. మరి అతడిని చంపిందెవరు..? ఎందుకు చంపాల్సి వచ్చింది. 

నమ్మించి ప్రాణం తీశాడు
ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం ఓ కిరాతకుడు దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి తర్వాత తండ్రిని పొట్టనపెట్టుకున్నాడు. పక్కా ప్లాన్‌తో ప్రాణం తీసి ప్రమాదకరంగా చిత్రీకరించాడు. చివరకు చేసిన పాపం పండి కటకటాలపాలయ్యాడు. నల్గొండ జిల్లాలో గత నెలలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా సంచలనం రేపింది.

కంత్రీ ఐడియా 
రమేశ్‌…వృత్తి రీత్యా లారీ ఓనర్‌ కం డ్రైవర్‌. నల్గొండ జిల్లా మునగాల గ్రామంలో జీవనం సాగిస్తుంటాడు. గతంలో ఫైనాన్స్‌లో రెండు లారీలు తీసుకున్నాడు. కొన్ని నెలలు డబ్బులు కట్టినా రమేశ్‌ ఆ తర్వాత కట్టడం మానేశాడు. అప్పుల పాలు కావడంతో నెలనెలా కిస్తీలు కట్టడం ఆపేశాడు. దాంతో ఫైనాన్స్‌ అధికారులు ఆ లారీలను లాక్కెళ్లారు. ఓ వైపు అప్పు ఇచ్చినవాళ్లు..మరోవైపు ఫైనాన్స్‌ అధికారుల ఒత్తిడి పెరిగిపోయింది. అప్పుడే అతడిలో ఓ కంత్రీ ఐడియా మెదిలింది. 

బాబాయ్ సైదులు పేరు మీద ఇన్సూరెన్స్‌
రమేశ్‌కు ఓ బాబాయ్‌ ఉన్నాడు. అతడే మృతుడు సైదులు. సైదులుకు తల్లిదండ్రులు లేరు. లారీ క్లీనర్‌గా పని చేస్తూ..జులాయిగా గ్రామంలో తిరుగుతుండేవాడు. అప్పుల బాధ నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ వచ్చిన రమేశ్‌ కన్ను…బాబాయి అయిన సైదులపై పడింది. సైదులు పేరు మీద ఇన్సూరెన్స్‌ చేయించి..కొద్ది రోజులయ్యాక చంపేసి ప్రమాదకంగా చిత్రీకరిస్తే…డబ్బు వస్తుందని భావించాడు. సైదులు అనాథ కాబట్టి….అతడి గురించి ఎవరూ కూడా అడిగేవాళ్లు ఉండారని అనుకున్నాడు. పక్కా ప్లాన్‌తో సైదులు పేరు మీద 50 లక్షలు ఫైనాన్స్‌ చేయించాడు. అంతేకాదు తెలివిగా నామిని పేరును తన తల్లిని పేరును రమేశ్‌ పెట్టాడు. 

బొలేరో వాహనంతో సైదులును ఢీ కొట్టిన రమేష్ 
అలా ఓ రెండు, మూడు నెలలు గడిచాయి. ఆ రెండు, మూడు నెలలు…రమేశ్‌ కిస్తీలు కడుతూ వచ్చాడు. ఇక తన ప్లాన్‌ అమలు చేయాలనుకున్నాడు. గత నెల 24న కొందరు స్నేహితులతో కలిసి బొలేరో వాహనంతో సైదులును ఢీ కొట్టాడు. ప్రమాదంలో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మొదట అందరూ దానిని రోడ్డు ప్రమాదంగానే భావించారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. 

బాబాయ్ ను హత్య చేసినట్లు ఒప్పుకున్న రమేశ్ 
రమేశ్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు…నిజం కక్కించారు. పోలీసుల విచారణలో అప్పుల కారణంగా తానే బాబాయిపై బీమా చేయించి హత్య చేసినట్లు అంగీకరించడంతో కటకటాలవెనక్కి నెట్టారు. చూశారుగా…డబ్బు కోసం..ఎంత వరకు తెగిస్తున్నారో…బంధాలు, బంధుత్వాలను మరిచి ఎలా ప్రవర్తిస్తున్నారో. ఇలాంటి ఘటనలు చూస్తుంటే…ఎవరిని నమ్మాలో…ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి.   

Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు