Chennai Nie : చెన్నై ఎన్ ఐ ఈలో ఎంపీహెచ్ కోర్సు లో ప్రవేశానికి ధరఖాస్తులు

విద్యార్హతలకు సంబంధించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉండాలి. పబ్లిక్ హెల్త్ సంబంధిత అంశాల్లో కనీసం మూడేళ్ళ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. కోర్సు ప్ర

Chennai Nie : చెన్నై ఎన్ ఐ ఈలో ఎంపీహెచ్ కోర్సు లో ప్రవేశానికి ధరఖాస్తులు

Icmr1

Chennai Nie :  చెన్నై ఐసీఎంఆర్ అధ్వర్యంలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ (ఎన్ఇఈ), మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(ఎంపీహెచ్) ప్రోగ్రామ్ లో ప్రవేశానికి ధరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎపిడిమియాలజీ అండ్ హెల్త్ సిస్టమ్స్ ప్రధాన స్పెషలైజేషన్ గా నిర్వహించే ఈ ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్ళు. కాగా మొత్తం 60 క్రెడిట్స్ ఉంటాయి.

వీటిలో కాంటాక్ట్ సెషన్స్ కు 22, ప్రాజెక్ట్ లకు 38 క్రెడిట్స్ గా నిర్ణయించారు. ఈ ప్రోగ్రామ్ లో ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఎపిడిమియాలజీ, బయోస్టాటిస్టిక్స్, డెమోగ్రఫీ, హెల్త్ సిస్టమ్స్, సోషల్ అండ్ బిహేవియర్ సైన్సెస్, మీడియా అండ్ కమ్యూనికేషన్, న్యూట్రిషిన్, ఆక్యుపేషనల్ అండ్ ఎన్విరాన్ మెంటల్ హెల్త్ అంశాలను వివరిస్తారు. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక నిర్వహిస్తారు.

విద్యార్హతలకు సంబంధించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉండాలి. పబ్లిక్ హెల్త్ సంబంధిత అంశాల్లో కనీసం మూడేళ్ళ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. కోర్సు ప్రారంభం నాటికి అభ్యర్ధుల వయస్సు 45 సంవత్సరాలకు మించరాదు. ఐసీఎంఆర్ ఉద్యోగులకు ఐదేళ్ళ సడలింపు ఉంటుంది.

ధరఖాస్తు ఫీజు 600గా నిర్ణయించారు. ధరఖాస్తులను రిజిస్టర్ పోస్టు లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తులను పంపేందుకు ఆఖరుతేది డిసెంబర్ 31, 2022 జులై 1 నుండి కోర్సుకు సంబంధించిన తరగతులు ప్రారంభమౌతాయి. ధరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; ఎంపీహెచ్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్, ఐసీఎంఆర్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ , నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ, తమిళనాడు హౌసింగ్ బోర్డ్, అయపక్కం, చెన్నై-600077, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; nie.gov.in