APSRTC Apprentice Recruitment : ఏపీఎస్‌ఆర్‌టీసీ కర్నూలు జోన్‌లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

ఆన్ లైన్ ద్వారా అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో అధార్ వివరాలు, పదోతరగతి సర్టిఫికెట్ లోని వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్ధులు రెజ్యూమ్ తోపాటు, ఇతర సర్టిఫికెట్ల ఒరిజినల్ కాపీలను తీసుకుని నవంబర్ 16న కర్నూలులోని ఆర్ టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో జరిగే ధ్రువపత్రాల పరిశీలినకు హాజరుకావాల్సి ఉంటుంది.

APSRTC Apprentice Recruitment : ఏపీఎస్‌ఆర్‌టీసీ కర్నూలు జోన్‌లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

APSRTC Apprentice Recruitment

APSRTC Apprentice Recruitment : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) కర్నూలు జోన్ పరిధిలో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 309 ఖాళీలను భర్తీచేయనున్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల పరిధిలో ఐటీఐలలో చదివినవారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హలు. ఆసక్తి, అర్హత ఉన్న వారు అప్పెంటిస్ ఖాళీలను దరఖాస్తు చేసుకోవచ్చు.

READ ALSO : Aishwarya Rai : ప్రపంచ సుందరికి 50 ఏళ్ళు.. నీలి కళ్ల సుందరి గురించి ఇవి మీకు తెలుసా..?

దరఖాస్తుకు అర్హతలు, ఖాళీల వివరాలు ;

డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. ఆయా ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆయా జిల్లాల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించి కర్నూలు- 49, నంద్యాల- 50, అనంతపురం- 52, శ్రీసత్యసాయి- 40, కడప- 67, అన్నమయ్య- 51.ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : AIIMS Gorakhpur Recruitment : ఎయిమ్స్‌ గోరఖ్‌పుర్‌లోనాన్ టీచింగ్ పోస్టుల భర్తీ

దరఖాస్తు ప్రక్రియ ;

ఆన్ లైన్ ద్వారా అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో అధార్ వివరాలు, పదోతరగతి సర్టిఫికెట్ లోని వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్ధులు రెజ్యూమ్ తోపాటు, ఇతర సర్టిఫికెట్ల ఒరిజినల్ కాపీలను తీసుకుని నవంబర్ 16న కర్నూలులోని ఆర్ టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో జరిగే ధ్రువపత్రాల పరిశీలినకు హాజరుకావాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజుకుగాను రూ.118 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల నిబంధనల అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

READ ALSO : Nutritional Deficiencies in Women : మహిళల్లో కనిపించే 5 సాధారణ పోషక లోపాలు…లక్షణాలు, పరిష్కారాలు

అభ్యర్థులు వివరాల కోసం 08518-257025, 7382869399, 7382873146 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిదినాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

ధ్రువపత్రాల పరిశీలిన సమయంలో అవసరమయ్యే సర్టిఫికేట్లు ;

1. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థి ప్రొఫైల్ డౌన్ లోడ్ కాపీ

2. అప్రెంటిస్ పోర్టల్ రిజిస్ట్రేషన్ నెంబరుకు సంబంధించిన వివరాలు

3 పదోతరగతి మార్కుల జాబితా

READ ALSO : Chhattisgarh Election 2023 : నాణాలతో నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థి .. తిరస్కరించిన అధికారులు

4. ఐటీఐ మార్కుల జాబితా

5. ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది.

6. వికలాంగులైతే అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం

7. ఎక్స్-సర్వీస్‌మెన్ విభాగాలకు చెందినవారైతే అందుకు సంబంధించిన సర్టిఫికేట్

8. ఎన్‌సీసీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు

9. ఆధార్ కార్డు

READ ALSO : Saffron Health Benefits : గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచటంతోపాటు మానసిక స్థితిని పెంచే కుంకుమ పువ్వు !

దరఖాస్తు గడువు తేది వివరాలు ;

దరఖాస్తు సమర్పణ, సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరు కావాల్సిన చిరునామా ; ప్రిన్సిపాల్, జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, ఏపిఎస్ఆర్టీసీ బళ్లారి స్క్వేర్, కర్నూలు (పో) & జిల్లా. నేటి నుండి అనగా 01.11.2023. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభమైంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 15.11.2023.గా నిర్ణయించారు. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 16.11.2023.గా పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.apsrtc.ap.gov.in/