Munugode Bypoll: చండూరు బహిరంగ సభలో కేసీఆర్ స్పీచ్‭లోని హైలైట్స్

ప్రభుత్వాలను కూలగొట్టే పనులు మంచివి కావు. రెండు సార్లు ప్రధానమంత్రి అవకాశం ఇచ్చారు కదా.. ఎందుకు ఈ ప్రలోభాలు..? జైల్లో ఉన్న ఆర్.ఎస్.ఎస్. నేతల వెనక ఎవరున్నారో బైటపడాలి. మునుగోడు ప్రజలు, మేధావులు బాగా ఆలోచించి ఓటేయాలి. ముండ్ల చెట్టు పెట్టి.. పండ్లు కావాలంటే ఎలా..? గాడుదులకు గడ్డేసి.. ఆవుకు పాలు పింతే వస్తాయా..? జీఎస్టీ పేరుతో జనాన్ని దోపిడి చేయడం ధర్మమేనా..?

Munugode Bypoll: చండూరు బహిరంగ సభలో కేసీఆర్ స్పీచ్‭లోని హైలైట్స్

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా చండూరులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కోసం తాము చేసిన పనుల గరించి చెప్తూనే, కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయం నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. నల్గొండ ఫ్లోరైడ్ భూతం అంతంపై రాజకీయ పార్టీల వైఖరిని ఎండగట్టారు. గంటకు పైగా సాగిన కేసీఆర్ ప్రసంగంలోని కొన్ని ముఖ్య అంశాలు..

‘‘మునుగోడులో అవసరం లేని ఉపఎన్నిక జరుగుతోంది. మునుగోడు ప్రజలు ఆల్రెడీ ఫలితం తేల్చేశారు. ఎలక్షన్ మోపైతే కొంతమంది గజం ఎత్తులో గాల్లో నడుస్తారు. రాజకీయ నాయకులు చెప్పే మాటలు ప్రజలు విని వదిలేయొద్దు, ఆలోచించాలి. వారిని గుడ్డిగా నమ్మి ఓటేసి మోసపోవద్దు. దేశంలో ఏం జరుగుతుందో ప్రజలు జర ఆలోచించాలి. కరిచే పామును మోడలో వేసుకోవద్దు. నాతోపాటు నలుగురు బిడ్డలు నాతోపాటు వచ్చారు. 100 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టినప్పటికీ ఎడమచెప్పుతో కొట్టిన నలుగురు ఎమ్మెల్యేలను మెచ్చుకోవాలి. పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్థన్ రెడ్డి, రేగా కాంతారావు.. అమ్ముడుపోకుండా గట్టి బుద్ది చెప్పారు.

Uttar Pradesh: చెరుకు తోటకు వెళ్లిన రైతును చంపిన పులి.. మూడు నెలల్లో ఆరుగురి మృతి

ప్రభుత్వాలను కూలగొట్టే పనులు మంచివి కావు. రెండు సార్లు ప్రధానమంత్రి అవకాశం ఇచ్చారు కదా.. ఎందుకు ఈ ప్రలోభాలు..? జైల్లో ఉన్న ఆర్.ఎస్.ఎస్. నేతల వెనక ఎవరున్నారో బైటపడాలి. మునుగోడు ప్రజలు, మేధావులు బాగా ఆలోచించి ఓటేయాలి. ముండ్ల చెట్టు పెట్టి.. పండ్లు కావాలంటే ఎలా..? గాడుదులకు గడ్డేసి.. ఆవుకు పాలు పింతే వస్తాయా..? జీఎస్టీ పేరుతో జనాన్ని దోపిడి చేయడం ధర్మమేనా..? కమ్యూనిస్టులతో కలిసి పోరాడతాం.. భవిష్యత్ లో కలిసి పనిచేస్తాం. చేనేత మీద జీఎస్టీ తీసేసేలా పోస్టుకార్డు ఉద్యమం చేయండి.. టీఆర్ఎస్‭కు ఓటేయండి. దేశంలో నాలుగు లక్షల మెగావాట్ల కెపాసిటీ ఉన్నా.. రెండు లక్షల మెగావాట్ల కంటే ఎక్కువ ఉత్పత్తి లేదు.

కార్పోరెట్ల జేబులు నింపే కేంద్ర ప్రభుత్వ మోసాలు గమనించాలి. వ్యవసాయ మోటార్లకు మీటర్లు మాత్రామే కాదు.. ఇండ్లలోకీ 30వేలు పెట్టి మీటర్లు పెట్టే కుట్రలు. ఆశపడితే.. గోసపడ్తాం. చావు నోట్లో తలకాయ పెట్టి.. ఉద్యమం చేసి.. తెలంగాణ తెచ్చుకున్నాం.  మీరు ఆలోచించి ఓటేయాలి.. లేదంటే తీవ్రంగా నష్టపోతాం. కేసీఆర్ గట్టిగా చెప్పినా.. మాకు ఓటేసినరని చెప్ఫుకుంటారు. దేశంలో వర్షంతో 1లక్ష 40వేల టీఎంసీలు నీరు వస్తే.. 70 వేల టీఎంసీలు నీరు వాడుకోవచ్ఛు. కర్పోరేట్ గద్దలకు వ్యవసాయం అప్పజెప్పాలనే కుట్రలు జరుగుతున్నయి. కేసీఆర్ కంటే ముందు ఎందరో సీఎంలు అయ్యారు.. అయినా ఎందుకు మునుగోడు గోస తీరలేదు?

Prajarajyam Party : ఏపీ రాజకీయవర్గాల్లో కలకలం.. చిరంజీవి ఫొటోతో పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతల కీలక భేటీ.. ఏం జరుగుతోంది?

ఫ్లోరైడ్‭ని ఎగ్జిబిషన్ మాదిరిగా చూశారు తప్పితే.. ఎం చేయలేదు. మర్రిగూడలో నేనే స్వయంగా వచ్చిన.. ఫ్లోరైడ్ పరిస్థితులు చూసి చలించి పాట రాసాను. జనంలో తిరుగుతున్న మోసపు జెండాలను చూసి గమనించాలి. ఒళ్లు మర్చి ఓటేసి.. ఇళ్లు కాల్చుకోవద్దు. కేంద్రం అవలంబించే బ్యాడ్ పాలసీతో నీరు రాదు.. కరెంట్ రాదు. తెలంగాణలో అభివృధి, సంక్షేమం చేసుకుంటున్నాం. మునుగోడు నుంచే ‘బీఆర్ఎస్’ పార్టీ పునాదిరాయి పడనుంది. ఒకనాడు సిద్దిపేట ప్రజలు నాకు తెలంగాణ ఉద్యమం కోసం వేళ్తే సంపూర్ణ మద్దతు ఇచ్చారు. నేడు మునుగోడు ప్రజలు కూడా ఇస్తారని ఆశిస్తున్నా.

చర్లగూడం ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయింది..? 8 ఏళ్లలో మా నీటి వాటా ఎందుకు ఇవ్వవు మోడీ..? కూసుకుంట్లని గెలిపిస్తే.. 15రోజుల్లో ఆర్డీవో, ఆసుపత్రి వస్తది. అద్దంలాగా రోడ్లు చేయిస్తాం. గెలిచినోడు జనంలో లేడు.. ఓడిన కూసుకుంట్ల ప్రజల మధ్యే ఉండు. దేశంలో సక్కదనం లేదు. దుర్మార్గ మతోన్మాద బీజేపీకి బుద్ది చెప్పాలి. డాలర్  82 రూపాయలైంది. నేపాల్, బంగ్లాదేశ్ కంటే వెనకున్నాం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి మోడీ జనం నడ్డీ విరుస్తుండు. లక్షల కోట్ల విలువైన విద్యుత్ వ్యవస్థను కార్పోరెట్లకు అప్పనంగా అప్పజెప్పాలనే కుట్రలు తిప్పికొట్టాలి.

Somalia Bomb Explosions : భారీ బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా.. 100మంది మృతి

ధాన్యం కొనమంటే చేతకాదు.. వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను మాత్రం కొంటారట. కత్తి ఒకరి చేతిలోపెట్టి.. యుద్దం మరొకరిని చేయమంటే వీలు కాదు. పెట్టుబడిదారుల తొత్తులుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి. 70 కోట్ల నుంచి 1200కోట్ల బడ్జెట్ కు  చేనేత కోసం పెట్టినం. రైతుబంధు, భీమా ఎక్కడా లేదు. కేసీఆర్ ఉన్నంతవరకు రైతుబంధు, భీమా ఆపం. కేంద్రం కార్పోరెట్లకు 14లక్షల కోట్లు ఇచ్చినవ్.. రైతులకు, లబ్దిదారులకు ఉచితాలు వద్దా..? తలమాసినోడు తడి బట్టలతో ప్రమాణం చేస్తడా..? దొరికింది కొంతే.. ఇంకా చాలా ఉంది. త్వరలోనే అంతా బైటపడ్తది.

ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోసే కుట్రలు తిప్పికొట్టాలి. ఎందరో కమ్యూనిస్టు యోధులు పుట్టిన నేల ఇది. బలవంతంగా మనపై రుద్దబడిన ఈ మునుగోడు ఉపఎన్నిక మంత్రి జగదీష్ లేకుండా గత 20ఏళ్లలో నేను ఏనాడూ పాల్గొనలేదు. ఆ బాధతో ఇక్కడికి వచ్చిన. ఆయన ఏం తప్పు చేసిండు జగదీష్..? దుర్మర్గ రాజకీయాలు చేసేటోళ్లకు.. నూకలు తినమన్నోల్ల తోకలు కట్ చేయాలి. వారు ఎన్నో ప్రలోభాలు చేస్తరు.. జనం గత్తర కావొద్దు.. మోసపోవద్దు. చర్లగూడం పూర్తిచేస్తా.. చండూర్ రెవిన్యూ డివిజన్ చేస్తా.. ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొస్తా.. రోడ్ల వేయిస్తా’’ అని కేసీఆర్ అన్నారు.

India vs South Africa: ఇండియాపై దక్షిణాఫ్రికా విజయం.. మూడో వన్డేలో పోరాడి ఓడిన భారత్