చికెన్ తింటే కరోనా రాదు.. గుడ్లు, పండ్లతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది : కేసీఆర్ 

  • Published By: sreehari ,Published On : March 27, 2020 / 12:10 PM IST
చికెన్ తింటే కరోనా రాదు.. గుడ్లు, పండ్లతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది : కేసీఆర్ 

గుడ్లు, చికెన్ తినడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. సి విటమిన్ ఉన్న పండ్లు ఎక్కువగా తినాలని తెలిపారు. మన చికెన్, గుడ్లు  బయటకు రాష్ట్రాలకు పోతాయని అన్నారు. చికెన్ తింటే కరోనా వస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ చెప్పారు. చికెన్ తింటే కరోనా తగ్గుతుందని చెప్పారు.

గుడ్లు తిన్నా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. అందరూ శరీర దారుఢ్యాన్ని పెంచుకోవాలని, అదే ఏకైక మందు అన్నారు. రోగ నిరోధక శక్తిని అందరూ పెంచుకోవాలని కేసీఆర్ సూచించారు. శరీర దారుఢ్యంతో పాటు శరీరంలోని వైరస్ యాంటీ బాడీస్, రోగ నిరోధక శక్తిని బాగా పెంపొందించుకోవాలని తెలిపారు. 

దీనికి సి విటమిన్ ఉంటే నిమ్మ పండ్లు, సంత్రాలు (కమలాలు), బత్తాయిలు బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ధానిమ్మ పండ్లు కూడా రోగనిరోధక శక్తికి బాగా పనిచేస్తాయని చెప్పారు. నల్గొండ జిల్లా సహా కొన్ని ఇతర జిల్లాల్లో బత్తాయి పంటలు బాగా పండుతున్నాయని, వాటిని మరో రాష్ట్రానికి పంపించరాదని కేసీఆర్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా ఒక్క పండు కూడా బయటకు పోకుండా చూడాలని అధికారులకు సూచనలు చేశారు.

బత్తాయి, కమలాలు, నిమ్మపండ్లు, ధానిమ్మ పండ్లతో పాటు మామిడి పండ్లు ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో మంచిగా పనిచేస్తాయని కేసీఆర్ తెలిపారు. బలవర్థకమైన ఆహారం గుడ్లను ఎక్కువగా తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని కేసీఆర్ తెలిపారు. పండ్లల్లో వాటర్ మిలాన్, సి విటమిన్ పండ్లు అయితే మరి మంచిదని చెప్పారు.